NBK 108 Update: బాలయ్య-అనిల్ రావిపూడి ప్రాజెక్టు నుంచి క్రేజీ అప్డేట్.. కీలక పాత్రలో సీనియర్ నటుడు
17 December 2022, 20:55 IST
- NBK 108 Update: బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో విలక్షణ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
బాలయ్య సినిమాలో శరత్ కుమార్
NBK 108 Update: నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలతో పాటు మరో పక్క అన్‌స్టాపబుల్ షోతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటించిన వీరసింహారెడ్డి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 మూవీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు.
లోకేషన్‌లో అనిల్ రావిపూడితో కలిసి శరత్ కుమార్ దిగిన స్టిల్‌ను విడుదల చేశారు. NBK108 సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఓ భారీ యాక్షన్ బ్లాక్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పైట్ సీక్వెన్స్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఓ భారీ సెట్‌ను నిర్మించారట.
బాలయ్య మునుపెన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు.. అనిల్ రావిపూడి తరహా కామెడీ ఎలిమెంట్స్ కూడా ఫుల్లుగా ఉండబోతన్నాయట. బాలయ్య స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని అనిల్ రావిపూడి పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసుకున్నారట.
ఈ సినిమాలో శ్రీలల కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బాలకృష్ణ-అనిల్ రావిపూడి, ఎస్ థమన్‌ల కాంబినేషన్‌లో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార్లాపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీఎం రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
టాపిక్