NBK108 Starts: గ్రాండ్‌గా లాంచ్‌ అయిన బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి మూవీ-nbk108 starts with pooja ceremony and an action sequence ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nbk108 Starts With Pooja Ceremony And An Action Sequence

NBK108 Starts: గ్రాండ్‌గా లాంచ్‌ అయిన బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి మూవీ

HT Telugu Desk HT Telugu
Dec 08, 2022 09:01 PM IST

NBK108 Starts: గ్రాండ్‌గా లాంచ్‌ అయింది బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి మూవీ. బాలయ్య కెరీర్‌లో 108వ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రస్తుతానికి ఎన్‌బీకే108గా ఈ మూవీని పిలుస్తున్నారు.

ఎన్‌బీకే108 మూవీ లాంచ్ లో దిల్ రాజు, అల్లు అరవింద్, బాలకృష్ణ, రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి
ఎన్‌బీకే108 మూవీ లాంచ్ లో దిల్ రాజు, అల్లు అరవింద్, బాలకృష్ణ, రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి

NBK108 Starts: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ ప్రేక్షకులను అలరించనుంది. గోపీచంద్‌ మలినేనితో వీర సింహారెడ్డి చేసిన బాలకృష్ణ.. ఇప్పుడు అనిల్‌ రావిపూడితో కలిసి కితకితలు పెట్టడానికి వస్తున్నాడు. ఎన్‌బీకే108 మూవీ గురువారం (డిసెంబర్‌ 8) గ్రాండ్‌గా లాంచ్‌ అయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ కింద సాహు గారాపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.

పూజా కార్యక్రమాలతో ఈ ఎన్‌బీకే108 లాంచ్‌ అయింది. ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టాడు. ఇక మరో స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు కెమెరా స్విఛాన్‌ చేవాడు. ఈ షాట్‌కు లెజెండరీ డైరెక్టర్‌ రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన నవీన్‌ ఎర్నేని, కిలారు సతీష్‌, ప్రొడ్యూసర్‌ శిరీష్‌లు స్క్రిప్ట్‌న మేకర్స్‌కు అందించారు.

గురువారం నుంచే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఓ యాక్షన్‌ సీన్‌ను చిత్రీకరించారు. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌ ఓ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ మూవీలో బాలకృష్ణ ఓ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు. తొలిసారి బాలయ్య బాబు ఇలాంటి లుక్‌లో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌తోపాటు అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీ కూడా ఎన్‌బీకే 108లో ఉండనుంది. బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని అనిల్‌ రావిపూడి ఓ పవర్‌ఫుల్‌ స్టోరీని రాసుకున్నాడు. శ్రీలీల ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. తమన్‌ మూడోసారి బాలయ్య సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

IPL_Entry_Point

టాపిక్