Urvashi Rautela lizard necklace: బల్లి నెక్లెస్‌తో భయపెట్టిన ఊర్వశి.. ఎలా ఉందో మీరే చూడండి
17 May 2023, 11:01 IST
- Urvashi Rautela lizard necklace: బల్లి నెక్లెస్‌తో భయపెట్టింది ఊర్వశి రౌతేలా. కేన్స్ 2023లో ఆమె ధరించిన ఈ నెక్లెస్ ఎలా ఉందో మీరే చూడండి. దీనిపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.
మెడలో బంగారు బల్లి నెక్లెస్ తో ఊర్వశి రౌతేలా
Urvashi Rautela lizard necklace: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో బల్లి నెక్లెస్ తో అందరినీ భయపెట్టింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. వెరైటీ ఫ్యాషన్ ఛాయిసెస్ తో అభిమానులను ఎప్పుడూ ఆకర్షించే ఊర్వశి.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో తన తొలి అప్పియరెన్స్ లోనూ అలాగే కనిపించింది. పింక్ డ్రెస్ ఓ రెడ్ కార్పెట్ పై ఊర్వశి మెరిసింది.
ఈ డ్రెస్సు చాలా మందికి నచ్చినా.. మెడలో ఆమె ధరించిన బల్లి నెక్లెస్ మాత్రం భయపెట్టింది. ఈ బంగారు బల్లి నెక్లెస్ కెమెరాలను విపరీతంగా ఆకర్షించింది. ఈ బల్లి నెక్లెస్ కు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఊర్వశి ధరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 76వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ఓపెనింగ్ అనే క్యాప్షన్ తో వాటిని అభిమానులతో పంచుకుంది.
అయితే ఆమె మెడలో బల్లి నెక్లెస్ మాత్రం అభిమానులకు నచ్చలేదు. దీంతో చాలా వరకూ నెగటివ్ కామెంట్స్ చేశారు. ఓ యూజర్ స్పందిస్తూ.. మెడలోని ఆ బల్లి బతికి వస్తే ఫొటోషూట్ వదిలేసి పారిపోతావా అని అనడం విశేషం. ఈ నెక్లెస్ చాలా దారుణంగా ఉంది అని మరో యూజర్ కామెంట్ చేశాడు. అయితే మరికొందరు ఫ్యాన్స్ కి మాత్రం ఊర్వశి ఛాయిస్ బాగా నచ్చింది.
కేన్స్ లో ఊర్వశి మరోసారి హిస్టరీ క్రియేట్ చేస్తోంది అని ఓ యూజర్ కామెంట్ చేయడం విశేషం. గ్రేట్ లుక్, ఫ్యాబులస్, బ్యూటీఫుల్ లాంటి కామెంట్స్ చేశారు. అయితే ఆమె మెడలో రెండు బల్లులతో కూడిన బంగారు నెక్లెస్ చూడగానే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. సడెన్ గా చూస్తే ఎవరైనా కాస్త జంకడం ఖాయం. ఊర్వశి త్వరలోనే బాలీవుడ్ లో నటి పర్వీన్ బాబీ బయోపిక్ లో నటించబోతోంది.
ఈ మూవీలో పర్వీన్ బాబీ పాత్రలో ఊర్వశి రౌతేలా నటించనుంది. ఆమె ఈ మధ్యే తెలుగులో అఖిల్ అక్కినేనితో కలిసి ఏజెంట్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది.