తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cannes Film Festival: కేన్స్ వేడుకల్లో చీరలో మెరిసిన తారలు

Cannes film festival: కేన్స్ వేడుకల్లో చీరలో మెరిసిన తారలు

15 May 2023, 19:49 IST

Cannes film festival: కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో చీరల్లో మెరిసిన తారలు, వాళ్ల చీరల వివరాలు తెలుసుకుందాం. 

Cannes film festival: కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో చీరల్లో మెరిసిన తారలు, వాళ్ల చీరల వివరాలు తెలుసుకుందాం. 
76 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 16 న జరగనుంది. మే 16 నుంచి మే 27 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ప్రపంచంలోనే గొప్ప చలన చిత్ర వేడుకలివి. రెడ్ కార్పెట్ కి కూడా ఈ వేడుక పెట్టింది పేరు. పెద్ద నటులు, మెడళ్లు, ప్రముఖ తారలు ఈ రెడ్ కార్పెట్ పై వివిధ డ్రెస్సులతో అలరిస్తారు. కొంతమంది విచిత్రమైన వేషధారణలో కనిపిస్తే, కొంతమంది వాళ్ల దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ వేషధారణలో అలరిస్తారు.  ఇప్పటివరకుకేన్స్ ఉత్సవంలో మన దేశ సంస్కృతి ఉట్టిపడేలా కొంత మంది తారలు చీరలో మెరిసిపోయారు. 
(1 / 7)
76 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 16 న జరగనుంది. మే 16 నుంచి మే 27 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ప్రపంచంలోనే గొప్ప చలన చిత్ర వేడుకలివి. రెడ్ కార్పెట్ కి కూడా ఈ వేడుక పెట్టింది పేరు. పెద్ద నటులు, మెడళ్లు, ప్రముఖ తారలు ఈ రెడ్ కార్పెట్ పై వివిధ డ్రెస్సులతో అలరిస్తారు. కొంతమంది విచిత్రమైన వేషధారణలో కనిపిస్తే, కొంతమంది వాళ్ల దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ వేషధారణలో అలరిస్తారు.  ఇప్పటివరకుకేన్స్ ఉత్సవంలో మన దేశ సంస్కృతి ఉట్టిపడేలా కొంత మంది తారలు చీరలో మెరిసిపోయారు. (Pinterest)
సోనమ్ కపూర్ సిల్వర్ సీక్వెన్లు ఉన్న చీరకు జతగా పొడవాటి ష్రగ్ తో స్టైలింగ్ చేసుకున్నారు. ఈ చీరలో సోనమ్ ప్రత్యేకంగా కనిపించింది. 
(2 / 7)
సోనమ్ కపూర్ సిల్వర్ సీక్వెన్లు ఉన్న చీరకు జతగా పొడవాటి ష్రగ్ తో స్టైలింగ్ చేసుకున్నారు. ఈ చీరలో సోనమ్ ప్రత్యేకంగా కనిపించింది. (Pinterest)
కంగనా రనౌత్: కంచిపట్టు చీరను కేన్స్ రెడ్ కార్పెట్ లుక్ కోసం ఎంచుకుంది కంగనా. ఈ సాంప్రదాయ చీరకట్టుకు జతగా ముదురు ఊదారంగు హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుంది. ఇది చీరకు స్టైలిష్ లుక్ వచ్చేలా చేసింది. 
(3 / 7)
కంగనా రనౌత్: కంచిపట్టు చీరను కేన్స్ రెడ్ కార్పెట్ లుక్ కోసం ఎంచుకుంది కంగనా. ఈ సాంప్రదాయ చీరకట్టుకు జతగా ముదురు ఊదారంగు హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుంది. ఇది చీరకు స్టైలిష్ లుక్ వచ్చేలా చేసింది. (Pinterest)
ఐశ్యర్యారాయ్ అభిషేక్ బచ్చన్ తో కలిసి పాల్గొన్న కేన్స్ ఉత్సవం రెడ్ కార్పెట్ లుక్. ఐశ్వర్య వెండి రంగు సీక్వెన్స్ ఉన్న చీరను దీనికోసం ఎంచుకుంది. 
(4 / 7)
ఐశ్యర్యారాయ్ అభిషేక్ బచ్చన్ తో కలిసి పాల్గొన్న కేన్స్ ఉత్సవం రెడ్ కార్పెట్ లుక్. ఐశ్వర్య వెండి రంగు సీక్వెన్స్ ఉన్న చీరను దీనికోసం ఎంచుకుంది. (Pinterest)
దీపికా పదుకొనే తొలి సారి కేన్స్ ఉత్సవంలో 2010 లో పాల్గొన్నప్పటి లుక్ ఇది. తెలుపు, గోల్డ్ జరీ మేళవింపుతో ఉందీ చీర.  
(5 / 7)
దీపికా పదుకొనే తొలి సారి కేన్స్ ఉత్సవంలో 2010 లో పాల్గొన్నప్పటి లుక్ ఇది. తెలుపు, గోల్డ్ జరీ మేళవింపుతో ఉందీ చీర.  (Pinterest)
హాఫ్ షోల్డర్ బ్లవుజు, ఫ్రిల్స్ ఉన్న చీరలో దీపికా అందరి దృష్టి ఆకర్షించింది. ఈ చీరకట్టును తెలుపు రంగు స్టేట్ మెంట్ నెక్‌లెస్ తో పూర్తి చేసింది. 
(6 / 7)
హాఫ్ షోల్డర్ బ్లవుజు, ఫ్రిల్స్ ఉన్న చీరలో దీపికా అందరి దృష్టి ఆకర్షించింది. ఈ చీరకట్టును తెలుపు రంగు స్టేట్ మెంట్ నెక్‌లెస్ తో పూర్తి చేసింది. (Pinterest)
విద్యాబాలన్ ఎరుపు రంగు చీరకు, అదే రంగు బ్లవుజు జత చేశారు. పలు వరుసలున్న ముత్యాల హారాన్ని మెడలో వేసుకున్నారు. 
(7 / 7)
విద్యాబాలన్ ఎరుపు రంగు చీరకు, అదే రంగు బ్లవుజు జత చేశారు. పలు వరుసలున్న ముత్యాల హారాన్ని మెడలో వేసుకున్నారు. (Pinterest)

    ఆర్టికల్ షేర్ చేయండి