తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tvf Web Series: ప్రతి స్టూడెంట్ తప్పక చూడాల్సిన టీవీఎఫ్ వెబ్ సిరీస్‌లు ఇవే..

TVF Web Series: ప్రతి స్టూడెంట్ తప్పక చూడాల్సిన టీవీఎఫ్ వెబ్ సిరీస్‌లు ఇవే..

Hari Prasad S HT Telugu

01 August 2023, 19:36 IST

google News
    • TVF Web Series: ప్రతి స్టూడెంట్ తప్పక చూడాల్సిన టీవీఎఫ్ వెబ్ సిరీస్‌లు ఇవే. యూత్ మెచ్చే, అందులోనూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేరయ్యే స్టూడెంట్స్ లో స్ఫూర్తి నింపే ఎన్నో వెబ్ సిరీస్ లను టీవీఎఫ్ క్రియేట్ చేసింది.
టీవీఎఫ్ రూపొందించిన ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్
టీవీఎఫ్ రూపొందించిన ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్

టీవీఎఫ్ రూపొందించిన ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్

TVF Web Series: ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల స్థానాన్ని మెల్లగా వెబ్ సిరీస్‌లు ఆక్రమించేస్తున్నాయి. వీటిలో చాలా వరకూ టైంపాస్ సిరీస్ లే అయినా కొన్ని సిరీస్ లు స్టూడెంట్స్ కోసం అందులోనూ ప్రత్యేకంగా కాంపిటీటీవ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేరవుతున్న వారిలో స్ఫూర్తి నింపేలా ఉన్నాయి. ఇలాంటి వెబ్ సిరీస్ లను తెరకెక్కించడంలో టీవీఎఫ్ (ది వైరల్ ఫీవర్) దిట్ట.

2010లో కొందరు ఔత్సాహికులు ప్రత్యేకంగా యువతను ఆకర్షించే ఉద్దేశంతో ఈ మీడియా హౌజ్ ను స్థాపించారు. ఈ 13 ఏళ్లలో టీవీఎఫ్ ఎన్నో అద్భుతమైన సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. వాటిలో టాప్ 10 సిరీస్ లు ఏంటో ఒకసారి చూడండి. ఈ సిరీస్ లను ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా చూడాలి.

టీవీఎఫ్ టాప్ వెబ్ సిరీస్ ఇవే

టీవీఎఫ్ తెరకెక్కించిన టాప్ వెబ్ సిరీస్ లు కొన్ని ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్ లన్నీ యువతను ముఖ్యంగా స్టూడెంట్స్ ను అమితంగా ఆకట్టుకునేవే.

ఆస్పిరెంట్స్ (Aspirants)

యూపీఎస్సీ (UPSC) సాధించాలని కలలు కనే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఈ ఆస్పిరెంట్స్. ఇండియాలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పేరుగాంచిన యూపీఎస్సీని ఎలా క్రాక్ చేయొచ్చో ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఐదు ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ను టీవీఎఫ్ యూట్యూబ్ ఛానెల్లో చూడొచ్చు.

సందీప్ భయ్యా (Sandeep Bhaiya)

పైన ఉన్న ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ లోని సందీప్ భయ్యా క్యారెక్టర్ పైనే నిర్మించిన మరో సిరీస్ సందీప్ భయ్యా. ఈ మధ్యే ఈ సిరీస్ యూట్యూబ్ లో రిలీజైంది. యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ కావాలని కలలు కనే సందీప్ భయ్యా, మరో నిరుపేద అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. యూపీఎస్సీ పరీక్షలు పాసవడంలో అందరికీ సాయం చేసే సందీప్ భయ్యా.. తన విషయానికి వచ్చే సరికి ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటాడన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.

కోటా ఫ్యాక్టరీ (Kota Factory)

టీవీఎఫ్ తెరకెక్కించిన మరో అద్భుతమైన సిరీస్ కోటా ఫ్యాక్టరీ. ఐఐటీ కోచింగ్ కోసం ఇండియాలో చాలా మంది కోటా బాట పడతారు. కానీ ఆ కోటాలోని కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులు ఐఐటీల్లో సీట్ల కోసం ఎలాంటి మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాంటి వైభవ్ అనే విద్యార్థి చుట్టూ తిరిగే కథ ఇది. 10 ఎపిసోడ్ల ఈ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

పిచర్స్ (Pitchers)

తమ ఉద్యోగాలను వదిలి స్టార్టప్ కంపెనీతో తమను తాము నిరూపించుకోవాలని కలలు కనే నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ పిచర్స్. కొన్నాళ్ల కిందట జీ5(Zee5) ఓటీటీలోకి వచ్చింది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టార్టప్ కంపెనీ నెలకొల్పాలనుకుంటున్న యువత కచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది. టీవీఎఫ్ యూట్యూబ్ ఛానెల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

హాఫ్ సీఏ (Half CA)

యూపీఎస్సీ, ఐఐటీల చుట్టూ తిరిగే కథలతో టీవీఎఫ్ చాలా సిరీస్ లే నిర్మించినా.. ఇండియాలో మరో అత్యంత కఠినమైన కోర్సు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పూర్తి చేయడం ఎంత కష్టమో తొలిసారి ఈ హాఫ్ సీఏ వెబ్ సిరీస్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఐదేళ్లుగా సీఏ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్న యువకుడు.. అప్పుడప్పుడే ఇంటర్ చదువు పూర్తి చేసుకొని సీఏ కలలు కంటూ ముంబైలో అడుగుపెట్టిన ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథే ఈ హాఫ్ సీఏ. అమెజాన్ మినీ టీవీ (Amazon mini tv)లో ఈ సిరీస్ చూడొచ్చు.

ఇవే కాదు.. టీవీఎఫ్ మరికొన్ని అద్భుతమైన సిరీస్ లను కూడా తెరకెక్కించింది. వాటిలో పంచాయత్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), క్యూబికల్స్ (జీ5 ఓటీటీ), ది ఇంటర్న్స్ (అమెజాన్ మినీ టీవీ), హాస్టల్ డేజ్ (ప్రైమ్ వీడియో) లాంటివి ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం