తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఉత్కంఠభరితంగా త్రిష ‘బృంద’ వెబ్ సిరీస్ ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Crime Thriller: ఉత్కంఠభరితంగా త్రిష ‘బృంద’ వెబ్ సిరీస్ ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

03 August 2024, 16:40 IST

google News
    • Brinda OTT Web Series Trailer: బృంద వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. క్రైమ్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్‍తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
Mystery Crime Thriller OTT: ఉత్కంఠభరితంగా త్రిష ‘బృంద’ వెబ్ సిరీస్ ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Mystery Crime Thriller OTT: ఉత్కంఠభరితంగా త్రిష ‘బృంద’ వెబ్ సిరీస్ ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Mystery Crime Thriller OTT: ఉత్కంఠభరితంగా త్రిష ‘బృంద’ వెబ్ సిరీస్ ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో బృంద వెబ్ సిరీస్ వస్తోంది. త్రిషకు ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్టుగా ఉంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ వస్తోంది. ఇటీవల టీజర్‌తోనే ఈ సిరీస్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. బృంద సిరీస్‍కు మనోజ్ వంగల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నుంచి నేడు (జూలై 21) ట్రైలర్ వచ్చింది.

ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్

బృంద వెబ్ సిరీస్‍లో సబ్‍ ఇన్‍స్పెక్టర్‌ పాత్ర పోషించారు త్రిష. డ్యూటీలోకి వెళ్లిన ఆరంభంలో మహిళా ఎస్ఐ అంటూ తోటి పోలీసులే త్రిషను చిన్నచూపు చూస్తూ మాట్లాడుతుంటారు. ఆ తర్వాత మనుషులను బలి ఇవ్వడం గురించి త్రిషకు కలలు వస్తుంటాయి. అయితే, అవి కలలు కాదని, గతం అంటూ త్రిషకు ఎవరో చెబుతున్నట్టుగా వాయిస్ ఓవర్ ఉంది.

ఓ సైకో హత్యలు చేస్తున్నట్టు ట్రైలర్లో ఉంది. ఒకేసారి చాలా మంది చనిపోతారు. ఈ కేసులను బృంద దర్యాప్తు చేస్తుంటారు. అయితే, ఆమె వ్యక్తిగత జీవితానికి కూడా ఈ కేసులతో లింక్ ఉన్నట్టు ట్రైలర్లో మేకర్స్ హింట్స్ ఇచ్చారు. బృంద (త్రిష) క్యారెక్టర్ వెనుక కూడా మిస్టరీ దాగుందనేలా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

బృంద ట్రైలర్ ఓవరాల్‍గా ఉత్కంఠభరితంగా, ఇంట్రెస్టింగ్‍గా సాగింది. మనుషుల బలి ఇవ్వడం, హత్యలు, ఇన్వెస్టిగేషన్‍లతో మిస్టీరియస్‍గా సాగింది. త్రిష తన మార్క్ నటనతో మెప్పించారు. మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ట్రెండీగా, డిఫరెంట్‍గా ఉంది. ఈ ట్రైలర్‌లో బృంద సిరీస్‍పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

బృంద వెబ్ సిరీస్‍కు దర్శకుడు సూర్య మనోజ్ వంగలనే కథ రాసుకున్నారు. కథలో ట్విస్టులు బాగానే ఉంటాడని ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఈ సిరీస్‍లో త్రిషతో పాటు ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమన్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి కీరోల్స్ చేశారు.

స్ట్రీమింగ్ డేట్.. ఏడు భాషల్లో..

బృంద వెబ్ సిరీస్ సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 2వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగులో రూపొందిన ఈ సిరీస్‍లో హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని సోనీలివ్ అధికారికంగా వెల్లడించింది.

బృంద వెహ్ సిరీస్‍ను యాడింగ్ అడ్వర్టైజింగ్ ఎల్ఎల్‍పీ పతాకంపై ఆశిష్ కొల్ల నిర్మించారు. దినేశ్ బాబు సినిమాటోగ్రాఫర్‌గా చేయగా.. అన్వర్ అలీ ఎడిటింగ్ చేశారు. ఆగస్టు 2వ తేదీ నుంచి బృంద సిరీస్‍ను జీ5 ఓటీటీలో చూసేయవచ్చు.

త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో విదా ముయర్చి మూవీలోనూ త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 31నే రిలీజ్ కానుంది. మలయాళంలో రెండ్, ఐడెంటిటీ అనే మూవీస్ కూడా ఆమె లైనప్‍లో ఉన్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలోనూ త్రిష నటిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం