Chiranjeevi, Ajith: చిరంజీవిని కలిసి అజిత్: వావ్ అంటున్న ఫ్యాన్స్.. అజిత్ ఏకైక తెలుగు మూవీతో చిరూకు సంబంధం ఏంటో తెలుసా?
Chiranjeevi - Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవిని తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కలిశారు. విశ్వంభర సెట్స్‌కు వెళ్లి పలకరించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi - Ajith Kumar: తమిళ సీనియర్ స్టార్ హీరో, తలా అజిత్ కుమార్ ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా చేస్తున్నారు. మార్క్ ఆంటోనీ ఫేమ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‍లో జరుగుతోంది. ఈ తరుణంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని అజిత్ కలిశారు. సర్‌ప్రైజ్ గెస్ట్ వచ్చారంటూ ఈ ఫొటోలను చిరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
విశ్వంభర సెట్స్ వద్ద..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ చిత్రీకరణ కూడా హైదరాబాద్‍లోనే జరుగుతోంది. దీంతో, విశ్వంభర షూటింగ్ సెట్స్‌కు అజిత్ కుమార్ వెళ్లారు. చిరంజీవిని కలిశారు. ఇద్దరూ కలిసి ముచ్చటించుకున్నారు. విశ్వంభర టీమ్‍తో అజిత్ ఫొటో దిగారు.
జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం
అజిత్ తనను కలిసిన ఫొటోలను షేర్ చేస్తూ ఇన్‍స్టాగ్రామ్‍లో సుదీర్ఘంగా క్యాప్షన్ రాశారు చిరంజీవి. అజిత్ నటించిన ఏకైక తెలుగు మూవీ ప్రేమ పుస్తకం (1993) ఆడియోను తాను లాంచ్ చేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని తెలిపారు. “విశ్వంభర సెట్స్‌కు గత సాయంత్రం ఓ సర్‌ప్రైజ్ స్టార్ గెస్ట్ వచ్చారు. సమీపంలోనే షూటింగ్ చేస్తున్న ప్రియమైన అజిత్ కుమార్ వచ్చారు. గొప్పగా సమయాన్ని గడిపాం. నేను ఆడియో లాంచ్ చేసిన ప్రేమ పుస్తకం సినిమా జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నాం. ఆయన భార్య షాలినీ.. నా మూవీ ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’లో బాలనటిగా నటించారు” అని చిరంజీవి పోస్ట్ చేశారు. తాము సంతోషించేందుకు ఇద్దరి మధ్య చాలా జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా అజిత్ స్టార్ డమ్ అత్యున్నతంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు చిరంజీవి రాసుకొచ్చారు.
చిరంజీవి, అజిత్ కుమార్‌ను ఒకే ఫ్రేమ్‍లో చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఇండస్ట్రీల సూపర్ స్టార్లను చూసి సర్‌ప్రైజ్ అవుతున్నారు. వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిరూ, అజిత్ కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అజిత్ చేసిన ఏకైక తెలుగు చిత్రం
కెరీర్ తొలినాళ్లలో ప్రేమ పుస్తకం అనే తెలుగు చిత్రం చేశారు అజిత్ కుమార్. 1993 జూలైలో ఈ చిత్రం రిలీజ్ అయింది. అప్పటికే తెలుగులో స్టార్ హీరోగా ఉన్న చిరంజీవి.. ప్రేమ పుస్తకం సినిమా ఆడియో లాంచ్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు అజిత్‍ను పరిచయం చేశారు. అజిత్ చేసిన ఏకైక తెలుగు చిత్రం ‘ప్రేమ పుస్తకం’. ఆ తర్వాత తమిళంలోనే సినిమాలు చేస్తూ టాప్ హీరోగా ఎదిగారు అజిత్. తెలుగులో మరే మూవీలో నటించలేదు.
చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర చేస్తున్నారు. బింబిసార ఫేమ్ విశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో హైక్వాలిటీ వీఎఫ్ఎక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 10వ తేదీన రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
టాపిక్