Virat Kohli | ఇంత హాట్‌గా ఉన్నావేంటి అనుష్కా.. భార్యకు కోహ్లి కాంప్లిమెంట్
02 April 2022, 16:54 IST
- క్రికెట్, బాలీవుడ్ సెలబ్రిటీ జోడీల్లో ముందుండేది విరాట్ కోహ్లి, అనుష్క శర్మనే. టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న అనుష్కశర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విరాట్.
కోహ్లి వందో టెస్ట్ సందర్భంగా విరుష్క జంట
ముంబై: క్రికెట్, బాలీవుడ్ లవ్లీ కపుల్స్‌లో విరుష్క జంట ఒకటి. ఈ కపుల్‌కు సోషల్ మీడియాలో చాలానే ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇండియాలోనే అతి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి విరాట్ కాగా.. అనుష్కకు కూడా ఇన్‌స్టాలో 5.75 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో వీళ్లు ఏ పోస్ట్ చేసినా వెంటనే దానికి వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చేస్తాయి.
శనివారం ఉదయం అనుష్క కూడా ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. భర్త విరాట్‌తో కలిసి చేసిన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలవి. ఓ పాప పుట్టిన తర్వాత అనుష్క కాస్త బొద్దుగా మారినా.. ఇప్పటికే హాట్‌గానే కనిపిస్తోంది. అభిమానులకే కాదు.. ఆమె భర్త విరాట్‌కు కూడా అనుష్క చాలా హాట్‌గా కనిపిస్తోందట.
ఈ ఫొటోలు ఆమె ఇన్‌స్టాలో షేర్ చేయగానే విరాట్.. "ఉఫ్... టూ హాట్ అనుష్కశర్మ" అంటూ కామెంట్ చేయడం విశేషం. వీ క్లీన్ అప్ వెల్ అంటూ అనుష్క ఈ ఫొటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ పోస్ట్ చేసింది. వీటిని పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే సుమారు 20 లక్షల వరకూ లైక్స్ రాగా.. పది వేలకుపైగా కామెంట్స్ వచ్చాయి.
ప్రస్తుతం విరాట్ కోహ్లి ఐపీఎల్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు అనుష్క కూడా పాప పుట్టిన తర్వాత తొలిసారి సినిమాల్లోకి తిరిగి వస్తోంది. అది కూడా ఓ క్రికెటర్ జీవిత చరిత్రతో కావడం విశేషం. చివరిసారి 2018లో జీరో మూవీలో కనిపించిన అనుష్క.. ఇప్పుడు వుమన్ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ చక్డా ఎక్స్‌ప్రెస్‌లో ఆమె పాత్ర పోషిస్తోంది.