తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Narudi Brathuku Natana: అర‌వై అవార్డులు గెలుచుకున్న తెలుగు మూవీ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది - రిలీజ్ డేట్ ఇదే

Narudi Brathuku Natana: అర‌వై అవార్డులు గెలుచుకున్న తెలుగు మూవీ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది - రిలీజ్ డేట్ ఇదే

06 April 2024, 14:21 IST

google News
  • Narudi Brathuku Natana:పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించిన న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న మూవీ ఏప్రిల్ 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. రిలీజ్‌కు ముందే ఈ మూవీ అర‌వై అవార్డుల‌ను గెలుచుకుంది.

న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న మూవీ
న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న మూవీ

న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న మూవీ

Narudi Brathuku Natana: టాలీవుడ్‌లో టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న తెలుగు మూవీ న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. కేర‌ళ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రిషికేశ్వ‌ర్ యోగి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 26న థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ప్ర‌క‌టించింది.

గ్లింప్స్ రిలీజ్‌...

శ‌నివారం ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్‌లోని డైలాగ్స్ చూస్తుంటే స‌త్య అనే ఓ సినిమా న‌టుడి జీవితం చుట్టూ ఈ మూవీ క‌థ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. లైఫ్‌లో బాధ‌లు, క‌ష్టాలు, అవ‌మానాలు వ‌స్తుంటాయి. అడ్జెస్ట్ అవుతూ వెళ్లిపోవాలి అంతే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. విజువ‌ల్స్‌, లొకేష‌న్స్‌, మ్యూజిక్ ఈ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచాయి.

గ్లింప్స్ చూస్తుంటే ప్ర‌తి ఒక్క‌రి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఎంతో సహజంగా చూపించినట్టుగా అనిపిస్తోంది. న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న‌ షూటింగ్ అంతా కూడా కేరళలో జ‌రిగిన‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. కేరళ ప్రకృతి అందాలు ఈ మూవీకి హైలైట్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అర‌వై అవార్డులు...

రిలీజ్‌కు ముందే ఈ సినిమాను ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులనుఈ మూవీ గెలుచుకున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న‌లో కీల‌క పాత్ర పోషించిన నితిన్ ప్ర‌స‌న్న ఇటీవ‌ల రిలీజైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో విల‌న్‌గా క‌నిపించాడు.

ఇరవై సినిమాలు…

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో ప్ర‌స్తుతం ఇర‌వైకిపైగా సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. మ‌న‌మే, గూఢ‌చారి 2, ఎట్ ది రైట్ ఆఫ్ 65తో పాటు ప‌లు సినిమాలు షూటింగ్‌ను జ‌రుపుకుంటున్నాయి. సంతానం హీరోగా న‌టించిన వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామితో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ.

ఈ ఏడాది ర‌వితేజ తో ఈగ‌ల్ మూవీని నిర్మించింది. ధ‌మాకా త‌ర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో ర‌వితేజ చేసిన ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ బ్రో, నిఖిల్‌, కార్తికేయ 2తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ లాభాల‌ను తెచ్చిపెట్టాయి. ఓ వైపు నిర్మాణంలో కొన‌సాగుతూనే ఆదిపురుష్ తో పాటు మ‌రికొన్ని భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను పంపిణీచేశారు.

తదుపరి వ్యాసం