Anupam Parameswaran: కార్తికేయ 2 హిట్‌తో బాలీవుడ్‌లో ఛాన్స్ కొట్టేసిన అనుపమ!
17 August 2022, 14:06 IST
- అనుపమ పరమేశ్వరన్‌కు బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్ వచ్చిందట. ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఆమెతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైందని బీటౌన్ ఫిల్మ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కార్తికేయ 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
అనుపమ పరమేశ్వరన్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు కార్తికేయ 2తో అద్భుతమైన హిట్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తుండటంతో ఈ అనుపమ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇప్పటికే తెలుగులో వరుస పెట్టి చిత్రాలను చేస్తోన్న ఈ ముద్దుగుమ్మకు.. తాజాగా బాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. దీంతో ఈ ప్రేమమ్ బ్యూటీ హిందీలో త్వరలోనే అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్‌లో ఓ అగ్ర నిర్మాణ సంస్థ అనుపమ పరమేశ్వరన్‌తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఆమెకు అదిరిపోయే స్క్రిప్టు వినిపించారని టాక్. ఈ సినిమాతో బాలీవుడ్‌లో అనుపమను అరంగేట్రం చేయించాలని సదరు బీటౌన్ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు నడుస్తున్నాయి. అనుపమకు కూడా ఆ స్క్రిప్టు నచ్చిందని, అన్ని కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ప్రస్తుతం బాలీవుడ్‌పై దక్షిణాది చిత్రాల ఆధిపత్యం నడుస్తోన్న వేళ.. సౌత్ తారలను, సాంకేతిక నిపుణుల ప్రతిభను వాడుకోవాలని బీటౌన్ నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే ఇక్కడి హీరో, హీరోయిన్లతో పాన్ఇండియా రేంజ్‌లో సినిమా తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను ఉపయోగించుకొని వారు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఆ క్లబ్‌లో చేరగా.. తాజాగా అనుపమ పరమేశ్వర్ చేరిపోయింది.
తెలుగులో అ.. ఆ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అనుపమ.. కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం కార్తికేయ 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ చేతిలో మరో రెండు, మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆచి తూచి కథలను ఎంపిక చేసుకోవాలని ఈ ముద్దుగుమ్మ చూస్తోంది. ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డతో డీజే టిల్లు సీక్వెల్‌లో రాధిక పాత్రను సొంతం చేసుకుందీ బ్యూటీ.