Anupama Parameswaran | ఇకపై సింగిల్ కాదంటున్న అనుపమ.. ఇంతకీ ఎవరతను?-anupama says she is not single any more ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anupama Parameswaran | ఇకపై సింగిల్ కాదంటున్న అనుపమ.. ఇంతకీ ఎవరతను?

Anupama Parameswaran | ఇకపై సింగిల్ కాదంటున్న అనుపమ.. ఇంతకీ ఎవరతను?

Maragani Govardhan HT Telugu
May 31, 2022 10:52 AM IST

అనుపమ పరమేశ్వరన్ వ్యక్తిగత జీవతం గురించి అభిమానులు ఎప్పుడూ ఆత్రుతగా చూస్తుంటారు. తాజాగా తను ఇకపై సింగిల్ కాదని తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో ముద్దుగుమ్మ గురించి చర్చ జరుగుతోంది.

<p>అనుపమ పరమేశ్వరన్</p>
అనుపమ పరమేశ్వరన్ (Twitter)

అనుపమ పరమేశ్వరన్.. 'అ ఆ' సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే ఫుల్లు బిజీ అయింది. టాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అంతేకాకుండా తన అందంతో కుర్రకారును ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ. నటనతోనే కాదు.. వ్యక్తిగత జీవితం పరంగానూ యువతను తన వైపునకు తిప్పుకునేలా చేస్తుంది. టీమిండియా స్టార్ క్రికెటర్‌తో ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చినప్పటికీ.. ఆ తర్వాత అవన్నీ రూమర్లని తేలిపోయాయి. ఆ స్టార్ క్రికెటర్ తన చిరకాల ప్రేయసిని వివాహం చేసుకోవడంతో ఆప్పటి వరకు వీరి మధ్య వచ్చిన ఊహాగానాలకు చెక్ పడింది.

దీంతో అనుపమ వ్యక్తిగత జీవితం చర్చనీయాంశమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం తన పర్సనల్ లైఫ్ గురించి అభిమానులకు ఏ మాత్రం తెలియనివ్వకుండా జాగ్రత్త పడతోంది. తాజాగా ఆమె తన రిలేషన్‌షిప్ గురించి కొన్ని విషయాలను బయట పెట్టింది.

తన చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన రిలేషన్‌షిప్ స్టేటస్ కొద్దిగా అస్పష్టంగా ఉందని ఆమె స్వయంగా వెల్లడించింది. “నేను ఇకపై సింగిల్‌ కాను. బహుశా ఇది వన్ సైడ్ లవ్." ఆని తెలిపింది.

అనుపమ పరమేశ్వరన్ తన ప్రేమ జీవితానికి సంబంధించి అభిమానులు అనేక రకాల పేర్లతో సోషల్ మీడియాలో చర్చ నడిపారు. అయితే ఇంతకీ ఆమె ఎవర్ని ప్రేమిస్తుందో మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.సినిమాల విషయానికొస్తే అనుపమ పరమేశ్వరన్.. బటర్ ఫ్లై, కార్తీకేయ-2, 18 పేజీస్ లాంటి చిత్రాలు ముందు ఉన్నాయి. త్వరలోనే ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం