Tillu Square Climax: టిల్లూ స్క్వేర్ క్లైమ్యాక్స్ స్టన్నింగా ఉంటుంది.. అందరూ షాకవుతారు: సిద్దూ జొన్నలగడ్డ
27 March 2024, 19:05 IST
- Tillu Square Climax: టిల్లూ స్క్వేర్ మూవీ క్లైమ్యాక్స్ స్టన్నింగా ఉంటుందంటూ సిద్దూ జొన్నలగడ్డ చేసిన కామెంట్స్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ మూవీ శుక్రవారం (మార్చి 29) థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
టిల్లూ స్క్వేర్ క్లైమ్యాక్స్ స్టన్నింగా ఉంటుంది.. అందరూ షాకవుతారు: సిద్దూ జొన్నలగడ్డ
Tillu Square Climax: సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ టిల్లూ స్క్వేర్. సూపర్ డూపర్ హిట్ డీజే టిల్లూకు సీక్వెల్ గా వస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. సినిమా ప్రమోషన్లలో భాగంగా సిద్దూ చేసిన కామెంట్స్ వాటిని మరింత పెంచేశాయి. ఈ మూవీ క్లైమ్యాక్స్ చేసి షాక్ తింటారని అతడు అనడం విశేషం.
టిల్లూ స్క్వేర్ క్లైమ్యాక్స్
డీజే టిల్లు మూవీతో అందించిన వినోదాన్ని రెట్టింపు చేస్తామంటూ టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తోనే మేకర్స్ చెప్పేశారు. ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న మూవీ.. మొత్తానికి శుక్రవారం (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్లలో సిద్దూ జొన్నలగడ్డతోపాటు ఇతర టీమంతా బిజీగా ఉంది. ఈ సందర్భంగా మూవీ గురించి సిద్దూ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడిస్తున్నాడు.
ఈ సినిమా క్లైమ్యాక్స్ సన్నింగా ఉంటుందని, ప్రేక్షకులందరూ షాకవుతారని అతడు చెప్పాడు. "టిల్లూ స్క్వేర్ కు మంచి స్టోరీ ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ క్రేజీగా ఉంటుంది. ప్రీ-క్లైమ్యాక్స్ లో ఓ గొప్ప సర్‌ప్రైజ్ తోపాటు క్లైమ్యాక్స్ ఎపిసోడ్ షాకింగా ఉంటుంది. మొత్తంగా టిల్లూ స్క్వేర్ మూవీలో చాలా బలమైన ఎలిమెంట్స్ ఉన్నాయి" అని ప్రమోషన్లలో సిద్దూ జొన్నలగడ్డ చెప్పాడు.
ఈ మధ్యే మూవీ సాంగ్ రిలీజ్ లోనూ స్టోరీ గురించి అతడు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. "డీజే టిల్లు చేసే సమయంలో ప్రేక్షకుల్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాము. కానీ, టిల్లు స్క్వేర్‌పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా, మొదటి భాగాన్ని మించేలా సినిమాని రూపొందించాము. టిల్లు పాత్ర అలాగే ఉంటుంది. కానీ, కథ మాత్రం వేరేలా ఉంటుంది" అని అతడు అన్నాడు.
అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..
టిల్లూ స్క్వేర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో పోలిస్తే ఈ బుకింగ్స్ కాస్త తక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ లో ఇప్పటి వరకూ రూ.83 లక్షల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. నిజానికి ఇవి మంచి వసూళ్లే అయినా.. టిల్లూ స్క్వేర్ పై చాలా రోజులుగా ఉన్న క్రేజ్ కు మాత్రం ఇవి అద్దం పట్టడంలేదు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల బిజినెస్ చేసింది. ఇక డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.35 కోట్లకు కొనుగోలు చేసింది. వీటిని చూస్తేనే ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన భారీ ఓపెనింగ్స్ ను మేకర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే హాలిడే కూడా ఉండటంతో వసూళ్లు బాగానే ఉంటాని భావిస్తున్నారు.
ఈ సినిమా కేవలం 2 గంటల రన్ టైమ్ తోనే రాబోతోంది. సెన్సార్ వాళ్లు ఈ మూవీకి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. రెండేళ్ల కిందట ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ టిల్లూ స్క్వేర్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మధ్య బోల్డ్ సీన్స్ యువతను ఆకర్షిస్తున్నాయి.