తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Movies Ott: అక్టోబర్ తొలివారంలో ఒకే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు.. ఓ చిత్రం డైరెక్ట్‌గా స్ట్రీమింగ్

Telugu Movies OTT: అక్టోబర్ తొలివారంలో ఒకే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు.. ఓ చిత్రం డైరెక్ట్‌గా స్ట్రీమింగ్

30 September 2024, 7:19 IST

google News
    • OTT Telugu Releases: ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఒకే వారం మూడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఓ ఫీల్‍గుడ్ మూవీ అడుగుపెట్టనుంది. ఓ సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. ఆ వివరాలు ఇవే..
OTT Telugu Releases: అక్టోబర్ తొలివారంలో ఒకే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు.. ఓ చిత్రం డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
OTT Telugu Releases: అక్టోబర్ తొలివారంలో ఒకే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు.. ఓ చిత్రం డైరెక్ట్‌గా స్ట్రీమింగ్

OTT Telugu Releases: అక్టోబర్ తొలివారంలో ఒకే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు.. ఓ చిత్రం డైరెక్ట్‌గా స్ట్రీమింగ్

అక్టోబర్ తొలి వారంలో వివిధ ఓటీటీల్లో తెలుగు సినిమాలు రానున్నాయి. కాగా, ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే మూడు చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. థియేటర్లలో రిలీజై సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 35 - చిన్నకథ కాదు మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. వాయిదా పడిన బాలుగాని టాకీస్ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. మరో హారర్ థ్రిల్లర్ మూవీ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. అక్టోబర్ తొలి వారంలో ఆహాలో రానున్న మూడు చిత్రాలు ఏవంటే..

35 - చిన్న కథ కాదు

హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన ‘35-చిన్న కథ కాదు’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి చిత్రంగా ప్రశంసలు అందుకుంది. సెప్టెంబర్ 6వ తేదీన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమామీ దర్శకత్వం వహించారు. విశ్వదేవ్, ప్రియదర్శి, అరుణ్ దేవ్ కూడా ముఖ్యమైన పాత్రలు చేశారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకునే ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి రానుంది.

35 - చిన్న కథ కాదు చిత్రం అక్టోబర్ 2వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తేదీని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పాజిటివ్ బజ్ ఉండటంతో ఓటీటీలో ఈ చిత్రానికి మంచి వ్యూస్ దక్కే అవకాశం ఉంది. తన కుమారుడిని మ్యాథ్స్ సబ్జెక్టులో పాస్ చేయించేందుకు ఓ అమ్మ ప్రయత్నించడం, వారి కుటుంబం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. అక్టోబర్ 2 నుంచి ఆహాలో 35 - చిన్న కథ కాదు మూవీని చూడొచ్చు. సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా సమర్పించారు.

బాలుగాని టాకీస్

బాలుగాని టాకీస్ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తేదీనే తీసుకురానున్నట్టు ఆహా గతంలో చెప్పింది. అయితే, వాయిదా పడింది. అక్టోబర్ 4వ తేదీన ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు రెడీ అయింది. ఈ తేదీని ఇప్పటికే ఆహా ఓటీటీ ప్రకటించింది.

బాలుగాని టాకీస్ మూవీలో శివ రామచంద్రవరపు హీరోగా నటించారు. ఓ ఊర్లో థియేటర్ నడిపే అతడు బాలకృష్ణకు వీరాభిమానిగా ఉంటారు. అయితే, తన థియేటర్ విషయంలో అతడు చిక్కుల్లో పడతాడు. దీని చుట్టూనే ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఈ చిత్రంలో శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాక్ రెడ్డి, వంశీ నెక్కంటి కూడా కీలకపాత్రలు చేశారు.

బాలుగాని టాకీస్ చిత్రానికి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. రూరల్ కామెడీ డ్రామగా తెరకెక్కించారు. ఈ చిత్రం అక్టోబర్ 4న ఆహాలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

కళింగ

హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కళింగ’ సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ధృవవాయు ఈ చిత్రంలో హీరోగా నటించటంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. కళింగ మూవీని త్వరలో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఆహా ఓటీటీ ప్రకటించింది. అయితే, ఇంకా డేట్‍ను ఖరారు చేయలేదు. అయితే, అక్టోబర్ 2వ తేదీనే ఈ చిత్రాన్ని ఆహా స్ట్రీమింగ్ చేస్తుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍పై ఆహా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

తదుపరి వ్యాసం