OTT Comedy Movie: అప్పుడు వాయిదా పడిన కామెడీ మూవీ కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?
OTT Comedy Movie: ఓటీటీలోకి నేరుగా రావాల్సిన కామెడీ మూవీ కొన్నాళ్ల కిందట వాయిదా పడి ఇప్పుడు మళ్లీ రాబోతోంది. ఈ సినిమా కొత్త స్ట్రీమింగ్ తేదీని ఆహా ఓటీటీ అనౌన్స్ చేసింది. నిజానికి గత వారమే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా వేశారు.
OTT Comedy Movie: ఆహా ఒరిజినల్ కామెడీ మూవీగా రాబోతున్న బాలు గాని టాకీస్ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. నిజానికి సెప్టెంబర్ 13వ తేదీనే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ఆహా వీడియో మొదట అనౌన్స్ చేసింది. అయితే రిలీజ్ కు రెండు రోజుల ముందు సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తాజాగా అక్టోబర్ 4 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.
బాలు గాని టాకీస్ ఓటీటీ రిలీజ్ డేట్
ఆహా వీడియో ఒరిజినల్ మూవీ బాలు గాని టాకీస్. ఈ కామెడీ మూవీ మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అక్టోబర్ 4 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో వెల్లడించింది. అక్టోబర్ 4 నుంచి నాన్ స్టాప్ నాలుగు ఆటలు అని చెబుతూ కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
బాలు గాని టాకీస్ మూవీ ఏంటంటే?
కొన్ని రోజుల కిందట సినిమా రీల్ ఉండే పెట్టె.. దానిపై జై బాలయ్య అక్షరాలతో ఈ బాలు గాని టాకీస్ మూవీ అనౌన్స్ చేసింది సదరు ఓటీటీ. గత వారం మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. అది ఆసక్తికరంగా ఉంది. బాలు గాని టాకీస్ మూవీలో శివ రామచంద్రరావు హీరోగా నటించాడు. అతడు గతంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో పలు సినిమాలు చేశాడు.
బాలుగాని టాకీస్ మూవీకి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనిధి సాగర్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీకి స్మరణ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. అశ్విత్ గౌతమ్ స్క్రీన్‌ప్లే అందిస్తోండగా ఆదిత్య బీఎన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చుతున్నాడు.
బూతు సినిమాలతోనే తన పాతకాలం నాటి థియేటర్ ను నడిపించే బాలు.. తన టాకీస్ లో బాలయ్య సినిమాను ఆడించాలని కలలు కంటుంటాడు.
నిజానికి ట్రైలర్ మొదలయ్యేది కూడా ఆ డైలాగుతోనే. వచ్చే వారం రిలీజయ్యే బాలయ్య సినిమా మన థియేటర్లోకే రావాలని అక్కడ పని చేసే వ్యక్తితో హీరో అంటుండగా ట్రైలర్ ప్రారంభమవుతుంది. తర్వాత అతని కోసం పోలీసులు వెతకడం, ట్రైలర్ సెకండాఫ్ లో అసలు డైలాగులే లేకుండా సాగడం చూస్తుంటే ఈ మూవీ ఓ కామెడీ థ్రిల్లర్ గా కనిపిస్తోంది.
అసలు బాలు గాని టాకీస్ కు ఏం జరిగింది? అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది సినిమాలోనే చూడాలి. ట్రైలర్ చివర్లో రక్తం మరకలు ఉన్న పాతకాలం నాటి నాణేలను చూపించి మూవీపై మరింత ఆసక్తి రేపారు.