తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ డెబ్యూ మూవీకి రాజ‌మౌళి చెల్లెలు మ్యూజిక్ - సినిమా బ‌డ్జెట్ ఇర‌వై ల‌క్ష‌లే!

Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ డెబ్యూ మూవీకి రాజ‌మౌళి చెల్లెలు మ్యూజిక్ - సినిమా బ‌డ్జెట్ ఇర‌వై ల‌క్ష‌లే!

27 October 2024, 15:04 IST

google News
  • Thalapathy Vijay: 18 ఏళ్ల వ‌య‌సులో నాలైయ‌తీర్పు మూవీతో కోలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్‌. ఈ సినిమాకు ఎస్ఎస్ రాజ‌మౌళి సోద‌రి ఎమ్‌.ఎమ్ శ్రీలేఖ మ్యూజిక్ అందించింది. కేవ‌లం ఇర‌వై ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తో రూపొందిన నాలైయ‌తీర్పు డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ద‌ళ‌ప‌తి విజ‌య్‌
ద‌ళ‌ప‌తి విజ‌య్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్‌

Thalapathy Vijay: త‌మిళంలో అత్య‌ధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్నాడు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండ‌స్ట్రీలో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోన్న హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు. ఒక్కో మూవీకి వంద కోట్ల‌కుపైనే రెమ్యున‌రేష‌న్ అందుకుంటోన్నాడు.

నాలుగు వందల కోట్ల బడ్జెట్…

ప్ర‌స్తుతం విజ‌య్‌తో సినిమా అంటే మినిమం బ‌డ్జెట్ ఐదు వంద‌ల కోట్ల వ‌ర‌కు ఉండాల్సిందే. విజ‌య్ గ‌త మూవీ ది గోట్ 400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి ఈ స్టార్‌డ‌మ్‌, క్రేజ్ ఓవ‌ర్‌నైట్‌లోనే రాలేదు. పేరుప్ర‌ఖ్యాతుల కోసం ఎన్నో ఏళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు.

ప‌ద్దెనిమిదేళ్ల వ‌య‌సులో...

నాలైయ తీర్పు మూవీతో ప‌ద్దెనిమిదేళ్ల వ‌య‌సులో హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్‌. ఈ సినిమాకు విజ‌య్ తండ్రి ఎస్ఏ చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విజ‌య్ త‌ల్లి శోభ క‌థ‌ను అందించింది. తాము సంపాదించిన ఆస్తుల‌న్నీ ఖ‌ర్చుపెట్టి కొడుకుతో ఎస్ఏ చంద్ర‌శేఖ‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

రాజ‌మౌళి చెల్లెలు...

ఈ సినిమాకు టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి సోద‌రి ఎమ్ఎమ్ శ్రీలేఖ మ్యూజిక్ అందించింది. ఈ మూవీతోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలేఖ‌. ఆ టైమ్‌లో శ్రీలేఖ వ‌య‌సు కేవ‌లం 12 ఏళ్లు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. అతి చిన్న వ‌య‌సులో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మారి నాలైయ తీర్పు మూవీతో శ్రీలేఖ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పాట‌లు పెద్ద హిట్ట‌య్యాయి.

కేవ‌లం ఇర‌వై ల‌క్షల బ‌డ్జెట్‌తో ద‌ళ‌ప‌తి విజ‌య్ డెబ్యూ మూవీ నాలైయ తీర్పు రూపొందింది. క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో కీర్త‌న హీరోయిన్‌గా న‌టించింది. శ‌ర‌త్‌బాబు, శ్రీదివ్య‌, రాధార‌వి కీల‌క పాత్ర‌లు పోషించారు. 1992లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప‌ది ల‌క్ష‌ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ద‌ళ‌ప‌తి విజ‌య్ తండ్రికి భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.ఆస్తుల‌న్నీ పొగొట్టింది.

దారుణంగా విమ‌ర్శ‌లు...

ఈ సినిమాలో విజ‌య్ యాక్టింగ్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. విజ‌య్ లుక్‌, మ్యాన‌రిజ‌మ్స్‌లో ఏ మాత్రం బాగాలేవ‌ని, న‌టుడిగా అస్స‌లు ప‌నికారాడంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. కామెడీ ఫేసు అంటూ ఎగ‌తాళిచేశారు.

పాలిటిక్స్ లోకి ఎంట్రీ…

ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు విజ‌య్ రెడీ అవుతోన్నాడు. త‌మిళ వెట్రి క‌జ‌గ‌మ్ పేరుతో ఓ పొలిటిక‌ల్ పార్టీని స్థాపించాడు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పూజాహెగ్డే…మమితా బైజు…

పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ముందు చివ‌ర‌గా హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తోన్నాడు విజ‌య్‌. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఇటీవ‌ల లాంఛ‌నంగా మొద‌లైంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా...మ‌మితాబైజు ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం