తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Indian Idol Season 2: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫినాలేకు ముఖ్య అతిథి ఎవరో తెలుసా? హింట్ ఇచ్చిన ఆహా

Telugu Indian Idol Season 2: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫినాలేకు ముఖ్య అతిథి ఎవరో తెలుసా? హింట్ ఇచ్చిన ఆహా

19 May 2023, 22:31 IST

google News
    • Telugu Indian Idol Season 2: ప్రముఖ ఓటీటీ వేదికగా ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫినాలేకు ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని సమాచారం.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫినాలేకు ముఖ్య అతిథి ఎవరో తెలుసా?
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫినాలేకు ముఖ్య అతిథి ఎవరో తెలుసా?

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫినాలేకు ముఖ్య అతిథి ఎవరో తెలుసా?

Telugu Indian Idol Season 2: ఇండియన్ ఐడల్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రఖ్యాత షోను గతేడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా వేదికగా ప్రసారమవుతోంది ఈ షో. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ కూడా ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సీజన్-2 కూడా ముగింపు దశకు వచ్చేసింది. దీంతో ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారనే విషయంపై ఆహా చిన్న హింట్ ఇచ్చింది.

"పాన్ ఇండియా చర్చలు మొదలయ్యాయి అంటే ఇగ తగ్గేదేలే.. స్టార్ ఎవరో గెస్ చేయండి. తెలుగు ఇండియన్ ఐడల్ మాస్ ఫినాలే త్వరలో జరగబోతుంది. అప్డేట్ల కోసం చూస్తూ ఉండండి." అంటూ ఆహా ట్విటర్ వేదికగా పోస్టులో పేర్కొంది. అంతేకాకుండా ఓ చిన్న పాటి వీడియోను కూడా షేర్ చేసింది.

ఈ వీడియోను గమనిస్తే.. ఇటీవల విడుదలైన పుష్ప-2 టీజర్‌ మాదిరిగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫినాలేకు గెస్ట్ ఎవరో చర్చనీయాంశంగా మారింది అంటూ మొదలువుతుంది. దీంతో వీడియో ప్రారంభంలోనే ఈ రెండో సీజన్‌ ఫినాలేకు ముఖ్య అతిథి ఎవరో తేలిపోయింది. అదే ఇంకెవరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అవును ఈ సారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్‌-2 మాస్ ఫినాలేకు మన బన్నీ రాబోతున్నారు. దీంతో షోపై విపరీతంగా బజ్ ఏర్పడింది.

గతేడాది జరిగిన ఇండియన్ ఐడల్ మొదటి సీజన్‌లో నెల్లూరుకు చెందిన యువ గాయని బీవీకే వాగ్దేవీ గెల్చుకుంది. ఈ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆమెకు ప్రైజ్ మనీతో పాటు లక్ష రూపాయలు విలువైన ట్రోఫీని అందించారు. చిరంజీవితో పాటు రానా, సాయి పల్లవి ఈ షోలో సందడి చేశారు. మరి ఈ సారి అల్లు అర్జున్ రాబోతుండటంతో ఈ ఫినాలేపై ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌కు జడ్జిలుగా తమన్, కార్తిక్, గీతా మాధురి వ్యవహరిస్తున్నారు.

తదుపరి వ్యాసం