తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Teja Sajja On Hanuman: హనుమాన్ కోసం 70 నుంచి 75 సినిమాలు వదులుకున్నా: తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Teja Sajja on Hanuman: హనుమాన్ కోసం 70 నుంచి 75 సినిమాలు వదులుకున్నా: తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

05 February 2024, 7:38 IST

    • Teja Sajja on Hanuman: హనుమాన్ మూవీ కోసం తాను ఈ రెండున్నరేళ్లలో సుమారు 75 ప్రాజెక్టులను వదులుకున్నట్లు తేజ సజ్జా చెప్పడం విశేషం. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.
హనుమాన్ మూవీలో తేజ సజ్జా
హనుమాన్ మూవీలో తేజ సజ్జా

హనుమాన్ మూవీలో తేజ సజ్జా

Teja Sajja on Hanuman: హనుమాన్ మూవీ యువ నటుడు తేజ సజ్జా కెరీర్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతనితోపాటు టీమ్ ఊహించినదాని కంటే పెద్ద హిట్ సాధించింది. మూవీ రిలీజై 23 రోజులు కాగా.. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.290 గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. అయితే ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడిన తాను.. సుమారు 70 నుంచి 75 సినిమాలను వదులుకున్నట్లు తేజ చెప్పడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

హనుమాన్ కోసమే అలా..

హనుమాన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో నయా సెన్సేషన్ గా మారిపోయాడు ఈ తేజ సజ్జా. అతడు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హనుమాన్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా కోసం అతడు ఏకంగా రెండున్నరేళ్ల పాటు షూటింగ్ చేశాడు. ఈ సమయంలో తన దగ్గరికి వచ్చిన 70 నుంచి 75 ప్రాజెక్టులను కాదనుకున్నట్లు తేజ వెల్లడించాడు.

ఆ 75 సినిమాల్లోనూ ఓ15 వరకూ చాలా మంచి సినిమాలని అతడు చెప్పాడు. "హనుమాన్ కోసం నేను సుమారు 25 లుక్ టెస్టులు ఇచ్చాను. సాధారణంగా ఓ సినిమా కోసం ఏ నటుడైనా రెండు, మూడు టెస్టులు మాత్రమే ఇస్తారు. ఈ మూవీలో స్టంట్స్ అన్నీ నేనే చేశాను. బాడీ డబుల్ లేదా వీఎఫ్ఎక్స్ ఉపయోగించలేదు. స్కూబా డైవింగ్ నేర్చుకొని మరీ నీటి లోపల సీక్వెన్స్ షూట్ చేశాను" అని తేజ సజ్జా చెప్పడం విశేషం.

నిజానికి హనుమాన్ మూవీ బాక్సాఫీస్ నంబర్లను తాను ఎప్పుడూ పట్టించుకోలేదని, ఈ సినిమా ఆడియెన్స్ కు నచ్చిందా లేదా అన్నదే తాను చూశానని అతడు తెలిపాడు. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పెద్ద హిట్ సాధించింది. ప్రస్తుతం తేజ సజ్జాతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఫిమేల్ లీడ్ అమృతా అయ్యర్ అమెరికాలో ఈ మూవీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.

హనుమాన్ బాక్సాఫీస్ రిపోర్ట్

హనుమాన్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైంది. గుంటూరు కారం సినిమాకు పోటీగా రిలీజై ఆ సినిమానే మించి కలెక్షన్లు రాబట్టింది. శనివారం (ఫిబ్రవరి 3) వరకూ తొలి 23 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.290 గ్రాస్ వసూళ్లు సాధించింది. నిజానికి 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సంక్రాంతి సినిమాగా హనుమాన్ నిలిచినట్లు ఈ మధ్యే మూవీ టీమ్ కూడా వెల్లడించింది.

అమెరికాలో 5 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన ఈ హనుమాన్ సినిమా.. ఇండియాలోనే రూ.225 కోట్లు వసూలు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.140 కోట్ల వకరూ రావడం విశేషం. ఇక హిందీ మార్కెట్లో రూ.59 కోట్లు వచ్చాయి. సంక్రాంతి తర్వాత తెలుగులో చెప్పుకోదగిన మూవీ ఏదీ రిలీజ్ కాకపోవడం కూడా హనుమాన్ కు కలిసొస్తోంది. ఈ మధ్య శుక్రవారం కొన్ని చిన్న సినిమాలు రిలీజైనా.. వాటిలో చాలా మూవీస్ షోలు రద్దయ్యాయి. ఎగ్జిబిటర్లు వాటిని తీసేసి మళ్లీ సంక్రాంతి సినిమాలు ఆడిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం