Sankranthi Movies OTT Releases: ఓటీటీలో సంక్రాంతికి రిలీజైన 6 సినిమాలు.. ఏది ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Sankranthi Released Movies OTT Release Date: ఈ ఏడాది సంక్రాంతి పండుగకు స్టార్ హీరోలతోపాటు యంగ్ హీరోలు పోటీ పడ్డారు. సంక్రాంతి బరిలో మొత్తంగా ఆరు సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు వాటి ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది. కాబట్టి సంక్రాంతికి విడుదలైన సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్ చూస్తే..
Sankranthi Released Movies OTT Streaming Date: ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు బడా హీరోల సినిమాలు సందడి చేసిన విషయం తెలిసిందే. వారితోపాటు కుర్ర హీరో అయిన తేజ సజ్జ కూడా హనుమాన్ మూవీతో సంక్రాంతి బరిలోకి దిగాడు. అయితే అందరికంటే ఎక్కువగా హనుమాన్ సినిమానే ఎక్కువ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల హౌజ్ ఫుల్ బోర్డుతో హనుమాన్ థియేటర్లు సందడిగా మారాయి. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి తమిళంతో కలుపుకుని 6 సినిమాలు విడుదలయ్యాయి. వాటి ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడనే విషయంలోకి వెళితే..
గుంటూరు కారం
సంక్రాంతి బరిలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍లో వచ్చిన మూడో సినిమా అయిన గుంటూరు కారంపై విడుదలకు ముందు ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. నిజానికి సంక్రాంతికి పెద్ద హిట్ అందుకునేది గుంటూరు కారం మూవీనే అని టాక్ కూడా వచ్చింది. కానీ, ఆ అంచనాలు అన్ని ఒక్కసారిగా తారుమారు అయ్యాయి. రెగ్యులర్ సీన్, త్రివిక్రమ్ మార్క్ లేకుండా సినిమా ఉందని చాలా మంది అసహనం వ్యక్తం చేశారు.
గుంటూరు కారం ఓటీటీ
గుంటూరు కారం సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, హాట్ భామ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. వీరిలో మీనాక్షి పాత్ర పట్ల చాలా మంది నిరాశపడ్డారు. హీరోయిన్‌ను ఒక పనిమనిషిలా చూపించారని నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. హీరో హీరోయిన్లతోపాటు జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అయితే గుంటూరు కారం ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ మూవీ విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో గుంటూరు కారం ఓటీటీ (Guntur Kaaram OTT) ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
హనుమాన్ ఓటీటీ
మహేశ్ బాబుతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో దిగాడు యంగ్ హీరో తేజ సజ్జా. మరో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తొలి ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉండగా.. వాటికి మించి అందుకుంది. జనవరి 12ని విడుదలైన హనుమాన్ మూవీ ఇప్పటికే రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు జపనీష్, స్పానిష్, చైనీస్ ఇతర భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ జీ5 (Hanuman OTT)లో మార్చి 2వ వారంలో రిలీజ్ కానుంది. దాదాపుగా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.
సైంధవ్ ఓటీటీ
హిట్ ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన మరో మూవీ సైంధవ్. విక్టరీ వెంకేటేష్ 75వ సినిమాగా వచ్చిన సైంధవ్‌లో నవాజుద్దీన్ సిద్ధికీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా, జయప్రకాష్, జిషు సేన్ గుప్తా వంటి స్టార్ యాక్టర్స్ కీ రోల్స్ పోషించారు. ఎన్నో అంచనాల మధ్య జనవరి 13న విడుదలైన సైంధవ్ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. అనుకున్నంత స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. ఇక సైంధవ్ మూవీ ఓటీటీ (Saindhav OTT) హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సినిమాను ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
నా సామిరంగ ఓటీటీ
కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బిన్ని తొలిసారిగా దర్శకత్వం వహించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నా సామిరంగ జనవరి 14న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించి మరి లాభాలు సైతం తెచ్చుకుంది. నా సామిరంగ సినిమా (Naa Saami Ranga OTT) డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 15 నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. నా సామిరంగలో ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సార్ ధిల్లాన్, మిర్నా మీనన్ నటించారు.
కెప్టెన్ మిల్లర్ ఓటీటీ/ఆయలాన్ ఓటీటీ
సంక్రాంతి బరిలో తెలుగులో కాకుండా తమిళంలో ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ ఆయలాన్ సినిమాలు విడుదలయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగులో కెప్టెన్ మిల్లర్ విడుదలైన ఆయలాన్ మాత్రం రిలీజ్ కాలేదు. ఈ రెండు సినిమాల ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. అయితే కెప్టెన్ మిల్లర్ ఓటీటీ (Captain Miller OTT), ఆయలాన్ ఓటీటీ (Ayalaan OTT) రిలీజ్ డేట్స్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా కెప్టెన్ మిల్లర్‌ను మరో ఓటీటీ సంస్థ సన్ ఎన్‌ఎక్స్‌టీ కూడా సొంతం చేసుకుందని సమాచారం.