తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Web Series: తెలుగులోకి తమిళ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్.. ప్రోమో రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Web Series: తెలుగులోకి తమిళ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్.. ప్రోమో రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

23 October 2024, 12:55 IST

google News
    • Heart Beat OTT Web Series: హార్ట్ బీట్ వెబ్ సిరీస్ తెలుగులోకి వచ్చేస్తోంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ ప్రోమో నేడు రిలీజ్ అయింది. ఈ ప్రోమో ఎలా ఉందంటే..
OTT Web Series: తెలుగులోకి తమిళ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్.. ప్రోమో రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Web Series: తెలుగులోకి తమిళ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్.. ప్రోమో రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Web Series: తెలుగులోకి తమిళ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్.. ప్రోమో రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తమిళ వెబ్ సిరీస్ ‘హార్ట్ బీట్’ బాగా పాపులర్ అయింది. రీనా అనే జూనియర్ డాక్టర్ చుట్టూ ఈ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ తిరుగుతుంది. ఈ సిరీస్‍లో రీనా క్యారెక్టర్ చేశారు దీపా బాలు. ఈ సిరీస్‍కు దీపక్ సుందరరాజన్, అబ్దుల్ కబీజ్ దర్శకత్వం వహించారు. తమిళంలో మార్చిలో ఈ సిరీస్ వచ్చింది. ఇప్పుడు, హార్ట్ బీట్ వెబ్ సిరీస్ తెలుగులోనూ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి రానుంది. ఈ సిరీస్ ప్రోమోను హాట్‍స్టార్ నేడు (అక్టోబర్ 23) రిలీజ్ చేసింది. స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది.

ప్రోమో ఇలా..

ఆర్‌కే హాస్పిటల్‍లో హార్ట్ బీట్ సిరీస్ స్టోరీ ఉంటుంది. ఆ ఆసుపత్రిలో ఇంటర్న్‌ డాక్టర్‌గా ఉద్యోగానికి చేరతారు రీనా (దీపా బాలు). తొలి రోజే ఆసుపత్రికి రీనా లేట్‍గా రావటంతో ఈ సిరీస్ ప్రోమో మొదలైంది. గుండెలో నాలుగు చాంబర్లు ఉంటాయని, అదే విధంగా ఈ హాస్పిటల్‍లో తనకు నలుగురే లోకం అని రీనా చెబుతారు.

“ఒక్కో ప్రపంచంలో ఒక్కో ఎమోషన్. వీటన్నింటికీ నా హార్ట్ రియాక్ట్ అయ్యే బీట్ ఉందే” అని రీనా డైలాగ్ ఉంది. ఆ తర్వాత ఆసుపత్రిలో రీనాను అందరూ వెంటవెంటనే పిలుస్తుంటారు. ఆమె కంగారు పడుతుంటారు. ఈ కన్‍ఫ్యూజనే తన మొదటి ప్రపంచం అని రీనా చెబుతారు. తన చీఫ్ డాక్టర్ రధి (అనుమోల్) తన రెండో ప్రపంచం అని రీనా వివరిస్తారు. రీనాను రధి తిట్టేస్తారు. తన ప్రాబ్లం చీఫ్‍తోనే అని రీనా వివరిస్తారు. తన సహచర డాక్టర్ల గ్యాంగ్ మూడో ప్రపంచం అని అంటారు. ఈ సంతోషాన్ని మించిన స్థాయిలో ఇంకో ప్రపంచం ఉందని చెబుతారు. తన నాలుగో ప్రపంచం అర్జున్ (చారుకేశ్) అని, తనకు అన్నీ తానే అని రీనా చెబుతారు. వీటికి తన హార్ట్ రెస్పాండ్ అయ్యే బీట్ ఉందే అంటూ రీనా చెప్పటంతో ప్రోమో ముగిసింది.

హార్ట్ బీట్ తెలుగు స్ట్రీమింగ్ డేట్

హార్ట్ బీట్ వెబ్ సిరీస్ తెలుగులో అక్టోబర్ 30వ తేదీ నుంచి డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍ మొదలనుకానుంది. ఈ సిరీస్‍లో అన్ని ఎపిసోడ్లను హాట్‍స్టార్ ఒకేసారి తెస్తుందా.. విడతల వారీగా తీసుకొస్తుందా అనేది చూడాలి. ఈ సిరీస్ తమిళంలో ఈ ఏడాది మార్చి 8వ తేదీన స్ట్రీమింగ్ షురూ అయింది. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు తెలుగులో ఈ సిరీస్ డబ్బింగ్ అయింది. అక్టోబర్ 30న స్ట్రీమింగ్‍ తెలుగులో హార్ట్ బీట్ స్ట్రీమింగ్ ప్రారంభమవనుంది.

హార్ట్ బీట్ సిరీస్‍లో దీపా బాలుతో పాటు అనుమోల్, చారుకేశ్, అమిత్ భార్గవ్, యోగలక్ష్మి, షర్మిళ తాపా, ఆర్జీ రామ్, శబరీశ్, శర్వా, పదినే కుమార్, గురు లక్ష్మణ్ కీలకపాత్రలు పోషించారు. ఆసుపత్రి బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ ప్రధానంగా లవ్, ఎమోషన్లతో ఈ సిరీస్‍ను తెరకెక్కించారు డైరెక్టర్లు దీపక్ సుందరరాజన్, అబ్దుల్ కబీజ్ తెరకెక్కించారు.

తమిళ సూపర్ హిట్ మూవీ ‘లబ్బర్ పందు’ అక్టోబర్ 31వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి రానుంది. హరీశ్ కల్యాణ్, అట్టకత్తి దినేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి హిట్ అయింది. హాట్‍స్టార్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది.

తదుపరి వ్యాసం