Tamannaah on sex scenes: ఫ్యామిలీతో కలిసి సెక్స్ సీన్స్ చూడటం ఇబ్బందిగా అనిపించింది: తమన్నా
30 June 2023, 7:59 IST
- Tamannaah on sex scenes: ఫ్యామిలీతో కలిసి సెక్స్ సీన్స్ చూడటం ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది తమన్నా. ఆమె నటించిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లపై ఆమె స్పందించింది.
తమన్నా భాటియా
Tamannaah on sex scenes: ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ఆంథాలజీ లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా భాటియా ఎలా రెచ్చిపోయి నటించిందో మనం చూశాం. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి రొమాన్స్ పండించింది. తన 18 ఏళ్ల కెరీర్లో ఇలాంటి సెక్స్ సీన్లకు దూరంగా ఉన్న ఆమె.. ఈ మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఆ సీన్లు చేస్తోంది. విజయ్ తో తొలిసారి ముద్దు సీన్లలో నటించింది.
అంతేకాదు లస్ట్ స్టోరీస్ 2ని మీ ఫ్యామిలీతో కలిసి చూడండి అంటూ అభిమానులను అడిగింది. కానీ గతంలో తాను కూడా ఫ్యామిలీతో కలిసి సెక్స్ సీన్లు చూడటానికి ఇబ్బంది పడేదాన్నని తమన్నా ఇప్పుడు చెబుతోంది. లస్ట్ స్టోరీస్ 2లో కామం ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఉన్నాయని, కుటుంబంలో అందరూ కలిసి చూడండి అని ప్రమోషన్లలో భాగంగా ఆమె చెప్పడం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది.
సెక్స్ సీన్లు చూడటం ఇబ్బందే
తాను రెచ్చిపోయి నటించిన లస్ట్ స్టోరీస్ 2 అందరూ కలిసి చూడండని ఫ్యాన్స్ కు చెప్పినా.. తాను మాత్రం గతంలో అలాంటి సీన్లను ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇబ్బంది పడేదాన్నని తాజాగా తమన్నా చెప్పింది. న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.
"మా ఫ్యామిలీతో కలిసి కూర్చొని అలాంటి సీన్లు చూడటం ఇబ్బందిగా ఫీలయ్యే ఆడియెన్స్ లో నేనూ ఒకరిని. అలాంటి సీన్లు రాగానే చుట్టూ చూసేదాన్ని. ఇబ్బందిగా ఫీలయ్యేదాన్ని. నా కెరీర్లో చాలా కాలం సినిమాల్లో ఇంటిమసీకి దూరంగా ఉన్నాను. అందుకే ఇన్నాళ్లూ నేను ఇబ్బందిగా ఫీలైన సీన్లనే ఇప్పుడు చేస్తుండటం కాస్త వింతగా అనిపిస్తోంది.
ఇతర ప్రేక్షకులకు కూడా అలా అనిపించకూడదని నేను అనుకుంటున్నాను. ఆ భ్రమ నుంచి నేను బయటపడ్డాను. ఓ ఆర్టిస్ట్ గా నా గురించి నేను తెలుసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే భిన్నమైన పాత్రలు పోషిస్తున్నాను" అని తమన్నా చెప్పింది.
తమన్నాతోపాటు విజయ్ వర్మ, కాజోల్, నీనా గుప్తా, మృనాల్ ఠాకూర్ నటించిన ఈ ఆంథాలజీ ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. దీనికి పాజిటివ్ రివ్యూలు రావడం విశేషం. అక్రమ సంబంధం కలిగి ఉన్న జంటగా విజయ్ వర్మ, తమన్నా ఇందులో నటించడం విశేషం.