Tamannaah on Sex Scenes: సెక్స్ సీన్స్ చేయడం కూడా అలాంటిదే: తమన్నా షాకింగ్ కామెంట్స్
23 June 2023, 10:26 IST
- Tamannaah on Sex Scenes: సెక్స్ సీన్స్ చేయడం కూడా అలాంటిదే అంటూ తమన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్యకాలంలో స్క్రీన్ పై చెలరేగిపోతున్న ఆమె.. ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేయడం విశేషం.
స్క్రీన్ పై బోల్డ్ సీన్లకు సై అంటున్న తమన్నా
Tamannaah on Sex Scenes: టాలీవుడ్ ను కొంతకాలం పాటు ఏలిన తమన్నా.. అందాల ఆరబోత విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు కానీ.. సిల్వర్ స్క్రీన్ పై హీరోలతో సెక్స్ సీన్లు మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్న ఆమె.. చెలరేగిపోతోంది. లస్ట్ స్టోరీస్ లో తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో, జీ కర్దాలో మరో హీరోతో ఇంటిమేట్ సీన్లలో నటించింది.
తమన్నా ఏంటి ఇలా చేస్తోందన్న అనుమానం చాలా మందికి కలిగింది. ఇప్పుడిదే ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది. కాలం మారుతోంది మనమూ మారాలంటూ ఆమె అనడం విశేషం. ఒకప్పుడు తాను కూడా ఇలాంటి సీన్లు చేయడానికి ఇబ్బంది పడేదాన్నని, అయితే అది కూడా నటనలో భాగమే అయినప్పుడు ఎందుకు చేయకూడదని అనుకున్నట్లు చెప్పింది. ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ పార్ట్ 1 చూసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.
కాలంతో మారాల్సిందే: తమన్నా
ఈ మధ్య పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 2018లో నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ పై ఆమె స్పందించింది. "ఎన్నో కమర్షియల్ సినిమాలు చేసిన నాలాంటి నటి.. లస్ట్ స్టోరీస్ 1ను ఓ ప్రేక్షకురాలిగానే చూసింది. ఓ నటిగా అది నాకు ఎంతో శక్తిని ఇచ్చింది.
ప్రేక్షకులు ఇలాంటి స్టోరీలు చూడాలని అనుకుంటున్నట్లు తెలిసింది. అలాంటి సీన్లు చేయకూడదనుకున్న భావన, సిగ్గు మెల్లమెల్లగా తొలగిపోయింది. కాలంతోపాటు మనమూ మారాలి. ఓ ప్రేక్షకురాలిగా లస్ట్ స్టోరీస్ ను ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు" అని తమన్నా చెప్పింది.
ఇక స్క్రీన్ పై ఇంటిమేట్ సీన్లపై కూడా ఆమె స్పందించింది. "సెక్స్ సీన్లంటే నేను నో చెప్పేదాన్ని. కానీ ఓ నటిగా ఇంటిమసీ కూడా ఇతర సీన్లలాంటిదే అని అర్థం చేసుకునే అవకాశం నాకు లస్ట్ స్టోరీస్ ద్వారా కలిగింది. తింటున్న సీన్ లేదంటే ఏదైనా యాక్షన్ సీన్ లాంటిదే ఈ సీన్ కూడా అని అనిపించింది" అని తమన్నా అనడం విశేషం.