Tamanna Relationship : అవును అతడితో ప్రేమలో ఉన్నా.. లవర్‌పై తమన్నా క్లారిటీ
13 June 2023, 11:54 IST
- tamanna bhatia Love Relationship : కొన్ని రోజులుగా వార్తల్లో నటి తమన్నా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కారణం.. ఆమె ప్రేమ వ్యవహారం గురించే. ఇప్పుడు తమన్నా స్వయంగా తన ప్రేమ గురించి, తాను ప్రేమలో ఉన్న నటుడి గురించి బహిరంగంగా మాట్లాడింది.
తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamanna Bhatia) బహుభాషా నటి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా తాజాగా బాలీవుడ్‌లోనూ సినిమాలు అంగీకరిస్తోంది. చాలా కాలంగా దక్షిణాది నటీనటుల్లో తమన్నా పేరు అప్పుడప్పుడూ వినిపిస్తోంది. అయితే ఇటీవల, తమన్నా పేరు బాలీవుడ్(Bollywood) నటుడితో బాగా వినిపించింది. ఇక ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. తమన్నా స్వయంగా తన ప్రేమ గురించి ఓపెన్ గా మాట్లాడింది.
బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ వర్మ(Vijay Varma)తో తమన్నా పేరు వినిపిస్తోంది. వారిద్దరూ కొన్ని చోట్ల కలిసి కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని.. గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు నటి తమన్నా తనకు, విజయ్ వర్మ(Tamanna Vijay Varma)కు మధ్య ప్రేమను అంగీకరించింది. తాను విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నానని చెప్పింది. 'ఒకరు నాతో నటించారని ఆకర్షణ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నటీనటులతో నటించాను. నేను ఎవరికీ ఆకర్శితురాలిని కాలేదు. మీకు నిజంగా ఒకరిపై క్రష్ ఉంటే, భావాలు చాలా ప్రైవేట్‌గా ఉంటాయి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు, సక్సెస్ ఫుల్ పర్సన్ కాదా అనేది లెక్కలోకి తీసుకోరు.' అని తమన్నా చెప్పుకొచ్చింది.
ఇంకా మాట్లాడుతూ, విజయ్ వర్మను 'నా ఆనంద నిధి' అని అభివర్ణించింది. మా సంబంధం ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా సహజంగా ప్రారంభమైందని తెలిపింది. వారిద్దరు కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2(lust stories 2) సినిమా సెట్స్‌లోనే తన ప్రేమ ప్రారంభమైందని తమన్నా పేర్కొంది. అయితే కొద్దిరోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో తన గురించి, విజయ్ గురించిన వార్తల గురించి మాట్లాడుతూ.. దాని గురించి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం తనకు, విజయ్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ను మిల్కీ బ్యూటీ అంగీకరించింది.
విజయ్ వర్మ బాలీవుడ్‌లో ప్రతిభావంతుడైన నటుడు. మెుదట చిన్న పాత్రలలో నటించేవాడు. ఇప్పుడు ప్రధాన సహాయ పాత్ర లేదా విలన్ పాత్రలలో నటిస్తున్నాడు. 2012 నుంచి సినిమాల్లో నటిస్తున్న విజయ్ వర్మ తొలిసారిగా పింక్ సినిమాలో చిన్న నెగెటివ్ రోల్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత, 2019 చిత్రం గల్లీ బాయ్‌లో తన సహాయ పాత్రతో మంచి గుర్తింపు పొందాడు. విజయ్ తెలుగులో ఎంసీఏ(MCA) అనే సినిమాలో కూడా విలన్‌గా నటించాడు. ఇటీవల విడుదలైన దహద్ అనే వెబ్ సిరీస్‌లో విజయ్ వర్మ విలన్ పాత్రలో మెరిశాడు. నటి అలియా భట్‌తో కలిసి డార్లింగ్స్ అనే చిత్రంలో కూడా నటించాడు. ఇప్పుడు తమన్నా, విజయ్ వర్మ కలిసి లస్ట్ స్టోరీస్ 2 అనే సినిమాలో నటిస్తున్నారు.