తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Superstar Krishna College Photo: సూపర్‌స్టార్ కృష్ణ కాలేజ్ ఫొటో వైరల్.. చిత్రంలో మరో నటుడు కూడా ఉన్నారు.. ఎవరంటే?

Superstar Krishna College Photo: సూపర్‌స్టార్ కృష్ణ కాలేజ్ ఫొటో వైరల్.. చిత్రంలో మరో నటుడు కూడా ఉన్నారు.. ఎవరంటే?

17 November 2022, 18:20 IST

google News
    • Superstar Krishna College Photo: సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూసిన తర్వాత ఆయనకు సంబంధించిన విషయాలపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఆయన కాలేజ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో చదువుకున్న ఆయనతో పాటు మరో నటుడు కూడా ఉన్నారు.
60 ఏళ్ల క్రితం నాటి సూపర్ స్టార్ కృష్ణ ఫొటో వైరల్
60 ఏళ్ల క్రితం నాటి సూపర్ స్టార్ కృష్ణ ఫొటో వైరల్

60 ఏళ్ల క్రితం నాటి సూపర్ స్టార్ కృష్ణ ఫొటో వైరల్

Superstar Krishna College Photo: సూపర్‌స్టార్ కృష్ణ ఇటీవలే అనారోగ్య కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ మహాప్రస్థానం వేదికగా నిర్వహించారు. 50 ఏళ్లకు పైగా చలనచిత్ర సీమలో విశేష సేవలందించిన ఆయన 350కి పైగా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లో ఎన్నో విభిన్న జోనర్‌ సినిమాలను పరిచయం చేశారు. అంతేకాకుండా కొత్త సాంకేతికతలను, సృజనాత్మకతను ప్రోత్సహించారు. కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లు అందుకున్న కృష్ణ కళాశాలలో ఉన్నప్పుడే సినీ రంగంలోకి రావాలని కోరుకున్నారు. ఆయన ఏలూరు సీఆర్ఆర్ కలశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. కాలేజీలో చదివే రోజుల్లో ఆయనకు చెందిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలా మందికి తెలియని విషమేమంటే ప్రముఖ నటుడు, రాజకీయ నేత మురళి మోహన్, కృష్ణ ఇద్దరూ చిత్రసీమలోకి రాకముందు నుంచే స్నేహితులు. మురళిమోహన్, కృష్ణ కళాశాలలో కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ క్లాస్ మేట్స్ కావడం గమనార్హం. 1958-60 మధ్య డాక్టర్ సీఆర్ రెడ్డి కాలేజీలో వీళ్లిద్దరూ చదివిన బ్యాచ్ ఫొటో వైరల్ అవుతోంది. అందులో మురళి మోహన్, కృష్ణ ఇద్దరే పరిచయమున్న ముఖాలు. 60 ఏళ్ల క్రితం నాటి ఈ ఫొటోలో వీరిద్దరిని నెటిజన్లు గుర్తించి మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

తమ కశాశాల స్నేహాన్ని మురళీ మోహన్, కృష్ణ ఇద్దరూ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చివరి వరకు అలాగే కొనసాగించారు. వీరిద్దరి అనుబంధం అలాగే కొనసాగింది. మహాప్రస్థానానికి కృష్ణ పార్థివదేహాన్ని తరలిస్తున్న సమయంలో ఆయన భౌతిక కాయాన్ని మోసినవారిలో మురళి మోహన్ కూడా ఒకరు. వారి స్నేహం అలాంటిది.

ఈ ఆదివారం అర్ధరాత్రి తర్వాత సూపర్‌స్టార్ కృష్ణకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ఐసీయూకు మార్చి వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. అయితే గుండెపోటుతో పాటు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఆయన మంగళవారం ఉదయం 4.09 గంటలకు కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఘట్టమనేని కుటుంబంలో ఈ ఏడాది మూడు విషాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.

తదుపరి వ్యాసం