Sundeep Kishan on Michael: మైఖేల్ మూవీ చూసి నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి.. సందీప్ కిషన్ స్పష్టం
02 February 2023, 19:52 IST
- Sundeep Kishan on Michael: సందీప్ కిషన్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం మైఖేల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన సందీప్.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
సందీప్ కిషన్
Sundeep Kishan on Michael: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తుున్న పాన్ ఇండియా చిత్రం మైఖేల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలై మూవీపై అంచనాలను ప్రేక్షకుల్లో భారీగా పెంచేశాయి. రంజిత్ జీవకోడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రపచం వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ చిత్రం ఎంతో వైవిధ్యంగా, సరికొత్తగా ఉంటుందని పేర్కొన్నాడు.
"ఈ సినిమా స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నేరేషన్, మేకింగ్ అంతా సరికొత్తగా అనిపిస్తుంది. విజువల్‌గా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. డ్రామా, యాక్షన్ ఎంతో సరికొత్తగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు వాస్తవికతకు దగ్గరకు ఉంటాయి. మైఖేల్ పాత్ర చాలా వైల్డ్‌గా ఉంటాడు. అంతేకాకుండా చాలా వరకు ప్రశాంతంగా కనిపిస్తాడు. కోపమోస్తే మాత్రం భయంకరంగా కనిపిస్తాడు. స్నేహితులు ఉండరు. ఎవ్వరితోనూ మాట్లాడడు." అని సందీప్ కిషన్ మైఖేల్ సినిమాలో తన పాత్ర గురించి తెలిపాడు.
"ఈ సినిమా 80, 90వ దశకం నాటి నేపథ్యంలో సాగుతుంది. ఇందులో డార్క్ కామెడీ ఉంటుంది. లవ్ ట్రాక్ చాలా ఫన్నీగా సాగుతుంది. తీవ్రమైన పరిస్థితుల్లో వినోదం ఉత్పన్నమవుతుంది. రంజిత్ ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. అతడి సినిమాల్లో ఒకటి చూసి నా ఆలోచన చెప్పడానికి ఫోన్ చేశాను. ఓ నెల తర్వాత నాకు కథ చెప్పాడు. నేను వెంటనే ఓకే చెప్పాను. అతడికి కావాల్సినవన్నీ దొరికేలా చూసుకున్నాను." అని సందీప్ కిషన్ స్పష్టం చేశాడు.
సన్నగా కనిపించాల్సిన ఎపిసోడ్ కోసం కఠినమైన డైట్‌ను ఫాలో అయినట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. "ఈ ఎపిసోడ్‌ను 18 రోజుల పాటు చిత్రీకరించాము. ఒకానొక సమయంలో నా కుడి కాలు సరిగ్గా పనిచేయలేదు. ఈ ఎపిసోడ్ షూటింగ్‌లో నేను కూడా గాయపడ్డాను. సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నా శ్రమకు తగిన ఫలితం దొరికిందనిపించింది. మూవీ కోసం అందరూ చాలా కష్టపడ్డారు." అని సందీప్ కిషన్ తెలిపాడు.
మైఖేల్ సినిమాలో సందీప్ సరసన దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు విభిన్న పాత్రల్లో కనిపించారు. కరణ్ సీ ప్రొడక్షన్ల్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భరత్ చౌదరీ, పుష్కర్ రామ్ మోహన రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజిత్ జయకోడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు.