Michael Trailer : సందీప్ కిషన్ 'మైఖేల్' ట్రైలర్ అదిరిపోయిందిగా.. పాన్ ఇండియా హిట్ పడ్డటేనా?-sundeep kishan s pan india film michael trailer out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Michael Trailer : సందీప్ కిషన్ 'మైఖేల్' ట్రైలర్ అదిరిపోయిందిగా.. పాన్ ఇండియా హిట్ పడ్డటేనా?

Michael Trailer : సందీప్ కిషన్ 'మైఖేల్' ట్రైలర్ అదిరిపోయిందిగా.. పాన్ ఇండియా హిట్ పడ్డటేనా?

Anand Sai HT Telugu
Jan 23, 2023 12:40 PM IST

Michael Cinema Trailer : టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే.. ఈ యంగ్ హీరో ‘మైఖేల్’ అనే పాన్ ఇండియా సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.

మైఖేల్ ట్రైలర్ విడుదల
మైఖేల్ ట్రైలర్ విడుదల (twitter)

కెరీర్ మెుదటి నుంచి విభిన్న చిత్రాలతో అలరిస్తున్నాడు సందీప్ కిషన్(Sundeep Kishan). అయితే కమర్షియల్ హీరోగా స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టే ఒక్క హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, బీరువా, ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి కమర్షియల్ సినిమాలతో వచ్చినా.. సందీప్ కు స్టార్ స్టేటస్ తీసుకురాలేదు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. మైఖేల్ లాంటి పాన్ ఇండియా(Pan India) చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు.

ఈ సినిమాకు రంజిత్ జయంకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి లాంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన రాగా.. తాజాగా మైఖేల్ ట్రైలర్(Michael Trailer) కూడా విడుదల చేశారు. తెలుగుతోపాటుగా ఇతర భాషల్లోనూ రిలీజైంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తి కరంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం అదిరిపోయేలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే.. హీరోయిన్ చుట్టూ కథ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ సేతుపతి క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గౌతమ్ మీనన్ పాత్ర కూడా గతంలో లేదు. కొత్తగా కనిపిస్తోంది. వరుణ్ సందేశ్ సైతం.. ఇంత వరకూ చేయని పాత్రను ఒప్పుకున్నాడు. వరలక్ష్మీ కూడా ఈ సినిమాలో ఉంది. ట్రైలర్ తో భారీ అంచనాలు పెంచేశాడు సందీప్.

అమ్మయి జోలికి వెళ్లొద్దు, ప్రేమలో పడొద్దు అని దర్శకుడు చెప్పించాడు. ట్రైలర్ చివరలో అమ్మాయి కోసం కాకుండా అబ్బాయి వేరే ఏ విషయం గురించి బతకాలి అంటూ సందీప్ కిషన్ డైలాగ్ చెబుతాడు. లవ్, యాక్షన్ మిక్స్ అయిన ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందని అర్థమవుతోంది. సినిమా ట్రైలర్ చూస్తుంటే.. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సూపర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక నటుల విషయానికొస్తే.. అందరూ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేవాళ్లు ఉన్నారు. ట్రైలర్ చూసిన వాళ్లు సందీప్ కిషన్ పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టేలా ఉన్నాడని అంటున్నారు.

లవ్ కమ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి ౩న పాన్‌ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్ పీ, కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రామ్ మోహన్ రావు, భరత్ చౌదరి సంయుక్తంగా సినిమాను నిర్మించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం