Sundeep on Michael: నాగార్జున శివ మైఖేల్ లుక్‌కు స్ఫూర్తి.. సందీప్ కిషన్ స్పష్టం
Sundeep on Michael: మైఖేల్ సినిమా తన పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని సందీప్ కిషన్ స్పష్టం చేశాడు. ఈ సినిమాలోని తన పాత్రకు నాగార్జున శివనే స్ఫూర్తి అని తెలిపాడు. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
Sundeep on Michael: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. అతడు నటించిన మైఖేల్ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఫిబ్రవరి 3న సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
"నేను ఇంతకముందెన్నడు చేయని పాత్రను చేశాను. మైఖేల్‌లో కొత్తగా కనిపించడానికి మేక్ ఓవర్ చేయించుకోవాలనే ఆలోచన వచ్చింది. శివలో నాగార్జున పాత్రను ప్రేరణగా తీసుకున్నాను. అందులో మాదిరిగానే సన్నగా ఉంటుంది. నా శక్తి, సామర్థ్యాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్రయత్నంగానే స్టంట్లు చేయగలను. ఈ సినిమా చాలా బలంగా ఉంటుంది. 90ల నాటి గ్యాంగ్‌స్టర్ ప్రపంచం నేపథ్యంలో జరిగే క్రేజీ లవ్ స్టోరీ ఇది. నా కంఫర్ట్ జోన్‌ను ఛేదించి నన్ను నేను సవాలు చేసుకోవడానికే ఈ సినిమా ఎంచుకున్నాను." అని సందీప్ కిషన్ తెలిపాడు.
ఈ సినిమాలో తాను మూడు విభిన్న వయస్సున్న పాత్రలో నటించినట్లు చెప్పాడు. "మేము ట్రైలర్‌లోనే స్టోరీని చెప్పేశాం. ర్యాంబో ప్రేమలో పడ్డాడు అని హింట్ ఇచ్చాం. ప్రస్థానంతో పోలిస్తే ఇది పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. నేను ఈ సినిమాలో మూడు విభిన్న వయసున్న పాత్రల్లో కనిపించాను. 16, 24, 29 వయస్సులో ఉన్న వ్యక్తిగా కనిపిస్తాను." అని సందీప్ కిషన్ స్పష్టం చేశాడు.
ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు విభిన్న పాత్రల్లో కనిపించారు. కరణ్ సీ ప్రొడక్షన్ల్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భరత్ చౌదరీ, పుష్కర్ రామ్ మోహన రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజిత్ జయకోడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు.
సంబంధిత కథనం
టాపిక్