SSMB28 Update: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.. మహేష్-త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
26 March 2023, 19:34 IST
SSMB28 Update: సూపర్ స్టార్ మహేష్ బాబుకు అదిరిపోయే శుభవార్త వచ్చింది. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మహేష్ SSM28 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనుంది.
SSMB28 రిలీజ్ డేట్ ఫిక్స్
SSMB28 Update: సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దింకుంటోన్న సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది.
SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకాగ విడుదల చేయనున్నారు మేకర్స్. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేకమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో మహేష్ చేతిలో సిగరెట్ పట్టుకొని ఎంతో స్టైలిష్‌గా కనిపించారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. అడవిలో అర్జునుడు, ఆమె కథ, అమ్మ కథ, అమరావతికి అటు ఇటు లాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మరి వీటిలో ఏది ఫైనల్ అవుతుందో వేచి చూడాలి. ఇటీవల ఉగాది కానుకగా సినిమా టైటిల్‌ను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యం కాలేదు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.