తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Sri Ramadootha Stotram: హనుమాన్ నుంచి శ్రీ రామదూత స్తోత్రం.. లిరికల్ వీడియో రిలీజ్ టైమ్ ఖరారు

HanuMan Sri Ramadootha Stotram: హనుమాన్ నుంచి శ్రీ రామదూత స్తోత్రం.. లిరికల్ వీడియో రిలీజ్ టైమ్ ఖరారు

02 January 2024, 18:23 IST

google News
    • HanuMan Movie - Sri Ramadootha Stotram: హనుమాన్ సినిమా నుంచి మరో పాట రానుంది. శ్రీ రామదూత స్త్రోత్రం లిరికల్ వీడియో రిలీజ్‍కు టేడ్, టైమ్‍ను మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది.
Sri Ramadootha Stotram: హనుమాన్ నుంచి ‘శ్రీ రామదూత స్తోత్రం
Sri Ramadootha Stotram: హనుమాన్ నుంచి ‘శ్రీ రామదూత స్తోత్రం

Sri Ramadootha Stotram: హనుమాన్ నుంచి ‘శ్రీ రామదూత స్తోత్రం

HanuMan Movie - Sri Ramadootha Stotram: అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న హనుమాన్ మూవీ మరో 10 రోజుల్లో రానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు. ట్రైలర్ తర్వాత ఈ సూపర్ హీరో మూవీపై అంచనాలు ఆకాశానికి చేరాయి. ప్రమోషన్లలో చెబుతున్న విషయాలతో హనుమాన్ చిత్రంపై మరింత క్రేజ్ పెరుగుతోంది. ఈ తరుణంలో మరో పాటను రిలీజ్ చేసేందుకు ఈ సినిమా టీమ్ సిద్ధమైంది.

హనుమాన్ సినిమా నుంచి ‘శ్రీ రామదూత స్తోత్రం’ పేరుతో సాంగ్ రానుంది. ఈ రామదూత స్తోత్రం లిరికల్ వీడియో రేపు (జనవరి 3) ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారంగా వెల్లడించింది. హనుమంతుడిని స్తుతిస్తూ ఈ పాట ఉండనుంది. హనుమంతుడికి ప్రజలు నమస్కరిస్తున్నట్టుగా ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది హనుమాన్ టీమ్.

మరో ట్రైలర్..!

హనుమాన్ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. విజువల్ ఫీస్ట్‌లా అనిపించింది. ఈ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, రిలీజ్‍కు ముందు మరో ట్రైలర్‌ను తీసుకురావాలని హనుమాన్ టీమ్ భావిస్తోందట. త్వరలోనే రిలీజ్ ట్రైలర్ గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.

హనుమంతుడి వల్ల అతీత శక్తులను పొంది.. తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు విలన్లతో పోరాడే యువకుడి పాత్రను హనుమాన్ చిత్రంలో హీరో తేజ సజ్జా పోషించారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు.

జనవరి 12న పాన్ వరల్డ్ రేంజ్‍లో మొత్తంగా 11 భాషల్లో హనుమాన్ రిలీజ్ కానుంది. గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి.

తదుపరి వ్యాసం