తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sridevi Shoban Babu | 'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రం నుంచి తొలి పాట విడుదల

Sridevi Shoban babu | 'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రం నుంచి తొలి పాట విడుదల

15 April 2022, 22:23 IST

google News
    • టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం. నిన్ను చూశాక అంటూ సాగే ఈ పాటను రాకేందు మౌళి రాయగా.. జునైద్ కుమార్ ఆలపించారు.
సంతోష్ శోభన్ కొత్త చిత్రం
సంతోష్ శోభన్ కొత్త చిత్రం (twitter)

సంతోష్ శోభన్ కొత్త చిత్రం

తెలుగులో ఇటీవల కాలంలో తన చిత్రాలతో బాగా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో సంతోష్ శోభన్. పేపర్ బాయ్, మంచి రోజులు వచ్చాయి. ఏక్ మినీ కథ లాంటి వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటించిన ఈ యువ హీరో త్వరలో సరికొత్త కథతో ముందుకు రాబోతున్నాడు. అదే శ్రీదేవి శోభన్‌బాబు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని తొలి గీతం విడుదల చేసింది చిత్రబృందం. టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ సామాజిక మాధ్యమాల వేదికగా శుక్రవారం నాడు విడుదల చేశారు.

నిన్ను చూశాక అంటూ సాగే ఈ గేయం ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ మెలోడీగా సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ఈ పాటను రాకేందు మౌళి రచించగా.. జునైద్ కుమార్ ఆలపించారు. కమ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌరీ జీ కిషన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో నాగబాబు, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీఓపీ సిద్ధార్థ్ రామస్వామి కాగా.. ఎడిటర్ శశిధర్ రెడ్డి.

హీరో సంతోష్ శోభన్ విభిన్న తరహా చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. గతేడాది ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం శ్రీదేవి శోభన్‌బాబు చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా ప్రేమ్ కుమార్, అన్ని మంచి శకునాలే లాంటి వినోదాత్మక సినిమాలు చేస్తున్నాడు.

సంబంధిత కథనం

తదుపరి వ్యాసం