Sixth Sense in Star Maa: ఓంకార్ అన్నయ్య వచ్చేస్తున్నాడు.. సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ఎప్పటి నుంచంటే?
28 March 2023, 21:22 IST
Sixth Sense in Star Maa: ఓంకార్ అన్నయ్య వచ్చేస్తున్నాడు.. సిక్స్త్ సెన్స్ సీజన్ 5తో మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి, తన వన్ మినట్ డైలాగుతో హార్ట్ బీట్ పెంచడానికి రెడీ అవుతున్నాడు.
సిక్స్త్ సెన్స్ షోలో ఓంకార్
Sixth Sense in Star Maa: తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ అయిన స్టార్ మాలో వచ్చిన, వస్తున్న బెస్ట్ రియాల్టీ షోలలో సిక్స్త్ సెన్స్ (Sixth Sense) కూడా ఒకటి. ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటుడు ఓంకార్ హోస్ట్ చేసే ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఐదో సీజన్ తో మరోసారి ఓంకార్ అన్నయ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
టీవీ, సినీ సెలబ్రిటీలతో ఓంకార్ ఆడుకునే ఆట ఇది. వన్ మినట్ అంటూ సస్పెన్స్ ను మెయింటేన్ చేస్తూ హార్ట్ బీట్ పెంచేస్తుంటాడు. తాజాగా స్టార్ మా ఛానెల్ ఈ సిక్స్త్ సెన్స్ షో సీజన్ 5 ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ఐదో సీజన్ వచ్చే శనివారం (ఏప్రిల్ 1) ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ సిక్స్త్ సెన్స్ షో టెలికాస్ట్ అవుతుంది.
ఈసారి గెస్ట్ లిస్టులో హీరోయిన్ సదాతోపాటు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, కమెడియన్ హైపర్ ఆదిలాంటి వాళ్లు ఉన్నారు. "కింగ్ ఆఫ్ గేమ్ షోస్ సిక్స్త్ సెన్స్ సీజన్ 5 థ్రిల్ ను అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి. స్టార్ మాలో ఏప్రిల్ 1న రాత్రి 9 గంటలకు గ్రాండ్ లాంచ్ చూడండి. ఈ వినోదాన్ని మిస్ కావద్దు" అంటూ స్టార్ మా ఛానెల్ తన ట్విటర్ అకౌంట్లో ఈ షో ప్రోమోను పోస్ట్ చేసింది.
తొలి ఎపిసోడ్ చాలా సరదాగా సాగినట్లు ప్రోమో చూస్తే అనిపిస్తోంది. ఓంకార్ తన మార్క్ వన్ మినట్ డైలాగ్ తో పార్టిసిపెంట్స్ ను తెగ ఇబ్బంది పెట్టాడు. టార్చర్ పెడుతున్నాడంటూ సదా వాపోవడం ప్రోమోలో చూడొచ్చు. హైపర్ ఆది అయితే ప్రోమో చివర్లో తన మార్క్ పంచ్ డైలాగ్ వేశాడు. హార్ట్ ఎటాక్స్ వచ్చేది ఓంకార్ గారి వల్లే అని ఆది అంటాడు.
టాపిక్