Bigg Boss Telugu: గొంతుపై కాలేసి తొక్కేవాడిని.. శోభాపై శివాజీ ఫైర్.. పెళ్లి చేసుకునేవాడు భయపడతాడంటూ!
09 December 2023, 10:14 IST
Bigg Boss 7 Telugu Day 96 Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు డే 96 ఎపిసోడ్లో శోభా శెట్టిపై శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా అలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే గొంతుపై కాలేసి తొక్కేవాడినని, పెళ్లి చేసుకునే వాడు భయపడిపోతాడని ప్రశాంత్, యావర్‌తో శివాజీ చెప్పాడు.
బిగ్ బాస్ తెలుగు: గొంతుపై కాలేసి తొక్కేవాడిని.. శోభాపై శివాజీ ఫైర్.. పెళ్లి చేసుకునేవాడు భయపడతాడంటూ!
Bigg Boss 7 Telugu December 8th Episode: బిగ్ బాస్ 7 తెలుగు డిసెంబర్ 8వ తేది ఎపిసోడ్లో ఓట్ కోసం అప్పీల్ చేసుకునే టాస్క్ కంటిన్యూ అయింది. త్రో బాల్ టాస్క్‌లో ముందుగా శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఔట్ అయ్యారు. దాంతో శోభా, యావర్ సంచాలక్‌లుగా ఉన్నారు. అనంతరం అమర్ దీప్, ప్రశాంత్ గేమ్ నుంచి అవుట్ అయ్యారు. తర్వాత ఆ టాస్క్‌ను ప్రియాంక, శివాజీ, అర్జున్ ఆడారు. టాస్క్‌లో ప్రియాంకకు శోభా శెట్టి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది.
సంచాలక్‌గా ఉండి
ప్రియాంక అటు చూడు, ఇటు వేయు అంటూ శోభా మాట్లాడేసరికి కోపంగా గేమ్ నుంచి తప్పుకున్నాడు శివాజీ. సంచాలక్‌గా ఉండి ప్రియాంకకే సపోర్ట్ చేస్తే ఏంటన్నట్లు. మేము ఎందుకు పీకడానికా అంటూ ఫైర్ అయ్యాడు. అనంతరం శోభాకు, శివాజీకి పెద్ద గొడవ అయింది. శివాజీ మాటలకు వెటకారంగా రెస్పెక్ట్ ఇచ్చినట్లు శోభా మాట్లాడింది. దాంతో శివాజీ బాగా హర్ట్ అయ్యాడు. నిజానికి శివాజీతో అలా మాట్లాడే ధైర్యం ఎవరు చేయలేదు. ఎవరు మాట్లాడిన శివాజీ తన నైపుణ్యంతో అడ్డుకట్ట వేసేవాడు. కానీ, శోభా ముందు శివాజీ తేలిపోయాడు.
ఆర్టిస్టులే కదా
గేమ్ తర్వాత యావర్, ప్రశాంత్‌తో కూర్చుని శివాజీ మాట్లాడాడు. వాళ్లు గెలవనియ్యరురా మిమ్మల్ని. ఆడనివ్వరు. వాళ్లు ఆడపిల్లల అడ్వాంటేజ్ తీసుకుని ఎగబడుతున్నారు. క్యారెక్టర్ లేని మనుషులతో ఆడటం కంటే వదిలేయడమే బెటర్ అని శివాజీ అన్నాడు. అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చాడు. కాస్తా గౌరవం ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవా. ఆర్టిస్టులే కదా. ఇక్కడ అరిచి వేషాలు వేసేస్తే జనాలకు నచ్చేస్తామనే ఫీలింగ్ వాళ్లకు. అది ఎంతరా. ఆ బిడ్డ.. అలా మాట్లాడుతారురా ఎవరైనా. రేపు పొద్దున్న పెళ్లి చేసుకునేవాడు భయపడడా. ఇట్ల ఎవరైనా బిహేవ్ చేస్తారా అని శివాజీ తన వెర్షన్ చెప్పుకున్నాడు.
నేను ఎక్కడా చూళ్లేదు
తర్వాత రాత్రి పడుకునే సమయంలో కూడా శోభా, ప్రియాంకల గురించి శివాజీ మాట్లాడాడు. వీళ్లను మళ్లీ బాబుగారు లేపారనుకో.. అమ్మో.. అమ్మో అని మాములు పర్ఫామెన్స్ కాదు. ముగ్గురు ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్. అయినా వాళ్లేం ఆడపిల్లలురా బాబు. నేను ఎక్కడా చూడలేదు అయ్యా ఇలాంటి ఆడపిల్లలను. ఇంత పిచ్చి తెలివితేటలున్న పిల్లల్ని నేను ఎక్కడ చూడలేదు అని శివాజీ అన్నాడు. మరుసటి రోజు ఉదయం కూడా అర్జున్‌తో ఇదే టాపిక్ మాట్లాడాడు శివాజీ.
గొంతు మీద కాలేసి
నిన్నటి దెబ్బకు నాకు బీపీ ఎక్కువైంది. అవతలోడు కాస్తా తేడాగా, తప్పుగా కనబడితే వెళ్లిపోతా. నాకు ఇట్ల నెట్టుకుంటా వీడిని తీసుకెళ్లాడు కదా అమర్ గాడు.. అమ్మ తోడు ఒకే దెబ్బ పడేది వాడికి. అలానే శోభా కూడా.. అలా మన ఇంట్లో ఆడపిల్ల అయితే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని.. అలా బిహేవ్ చేసి ఉంటే అంటూ శోభా శెట్టి గురించి శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.