Bigg Boss Telugu: అమర్ దీప్‌ను ఆడంగోడన్న రైతుబిడ్డ ప్రశాంత్.. గాజులు వేసుకుంటానంటూ రచ్చ
Bigg Boss 7 Telugu Amardeep Prashanth: బిగ్ బాస్ 7 తెలుగు ఆఖరి నామినేషన్స్ అరుపులు, కేకలతో జరిగాయి. ఈ క్రమంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్ దీప్ మధ్య భారీ ఫైట్ జరిగింది. బిగ్ బాస్ 7 తెలుగు డిసెంబర్ 4వ తేది ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..
Bigg Boss 7 Telugu 14th Week Nominations: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్లో చివరి నామినేషన్స్ చాలా హోరాహోరీగా జరిగాయి. ప్రస్తుతం ఏడుగురు ఉన్న హౌజ్ మేట్స్‌కు 14వ వారం నామినేషన్స్ నిర్వహించారు. ఈ నామినేషన్లలో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, శివాజీ, ప్రియాంక ఆరుగురు ఉన్నారు. ఇక అర్జున్ అంబటి ఫినాలే అస్త్ర సాధించండంతో నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు.
బిగ్ బాస్ 7 తెలుగు 14వ వారం నామినేషన్లలో ఎక్కువగా ఓట్లు సాధించిన అమర్ దీప్ చివరిగా నామినేట్ చేసేందుకు వచ్చాడు. ముందుగా ప్రతిసారీ సిల్లీ కారణాలతో నామినేట్ చేస్తావంటూ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. మూడు వారాలు వేయకుంటే నువ్ వేయలేదు.. గత రెండు వారాలు నామినేట్ చేస్తే నువ్ వేస్తున్నావ్.. బ్లాంకెట్ అని, సరిగా పనులు చేయట్లేదని వరస్ట్ రీజన్స్‌తో నామినేట్ చేస్తావంటూ అమర్ దీప్ చెప్పాడు.
నువ్ వేసేది సిల్లీ నామినేషన్స్.. ఫస్ట్ నుంచి నాపై నెగెటివ్తోనే ఉన్నాడు. అమర్ అన్న అసలు నిజం కాదు. మోసం చేస్తాడు అని ప్రశాంత్ అన్నాడు. అమర్ కోసం పల్లవి ప్రశాంత్ మాట ఇచ్చాడు కదా. మరి నన్ను కెప్టెన్‌గా ఎందుకు చేయలేదు అని వాదించాడు అమర్. నమ్మినోళ్లను మోసం చేయడం నీ గుణం.. మోసపోయింది నేను నువ్వు కాదు అంటూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇచ్చిన మాట నిలెబట్టుకోవాలి అది మొగోడి మాట అని అమర్ అన్నాడు.
అమర్ అలా అంటే.. నువ్వు ఆడోళ్ల మాట మాట్లాడుతున్నావా అని ప్రశాంత్ అన్నాడు. దానికి నన్ను ఆడోడు అంటావా.. ఆడంగోడు అంటావా.. గాజులు తీసుకురా వేసుకుంటా. సార్ మీరే విన్నర్ సార్. మేమంతా గోతులు తవ్వుకోని వచ్చినం సార్ అంటూ నానా రచ్చ చేశాడు అమర్ దీప్. అనంతరం యావర్‌ను కూడా నామినేట్ చేశాడు అమర్. ఈ సమయంలో మధ్య మధ్యలో కూడా నన్ను ఆడంగోడు అంటావ్ కదా.. గాజులు వేసుకుని తిరుగుతా అంటూ అపరిచితుడిలా ప్రవర్తించాడు అమర్.