Siri and Shrihan Marriage: శ్రీహాన్‌తో పెళ్లిపై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు.. వివాహంపై అప్డేట్..?
10 January 2023, 6:43 IST
- Siri and Shrihan Marriage: బిగ్‌బాస్ షోతో పాపులరైన సిరి-శ్రీహాన్ ప్రేమికులన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్‌లో ఉండటంతో పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై సిరి స్పందించింది.
సిరి-శ్రీహాన్
Siri and Shrihan Marriage: షార్ట్ ఫిల్మ్స్, ఇన్‌స్టా రీల్స్‌తో పాపులరైన సిరి హనుమంతు-శ్రీహాన్.. ప్రముఖ బుల్లితెర షో బిగ్‌బాస్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరూ ప్రేమికులు కాగా.. పెళ్లి చేసుకుంటామని ఇప్పటికే చాలా సార్లు హింట్ ఇచ్చేశారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్న సిరి.. ఆ షోలో ఎంతో నెగిటివిటీని మూటగట్టుకుంది. తన సహచర నటుడు షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి ఆమె వేసిన వేషాలను ఎంత రోత పుట్టించాయో అంత సులభంగా మరువలేం. ఫ్రెండ్స్ అంటారు మళ్లీ ఇలా ప్రవర్తిస్తున్నారంటి? అంటూ విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు.
షన్నూతో సిరి ఎంత క్లోజ్‌గా ఉన్నప్పటికీ శ్రీహాన్ మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. పైపెచ్చు ఆమెకు బయట నుంచి బాగానే సపోర్ట్ చేశాడు. షో నుంచి బయటకొచ్చినప్పుడు మొదట్లో కాస్త దూరం పెట్టినప్పటికీ తిరిగి తాము వెంటనే దగ్గరయ్యామని ఇటీవలే సిరీనే చెప్పుకొచ్చింది. ప్రేమతోనే నిన్ను స్వీకరిస్తా అంటూ శ్రీహాన్ తనను అర్థం చేసుకున్నాడని స్పష్టం చేసింది. సీజన్5లో సిరి కోసం బిగ్‌బాస్ స్టేజిపైన పాట పాడిన శ్రీహాన్.. సీజన్6లో కంటెస్టెంట్‌గా వచ్చాడు.
సిరికి షన్నూతో సన్నిహితంగా ఉండటం వల్ల నెగిటివిటీ రాగా.. శ్రీహాన్‌కు మాత్రం తన యాటిట్యూడ్‌తో జనాల దృష్టిలో కాస్త నెగిటివ్ అయ్యాడు. ముఖ్యంగా ఇనాయా సుల్తానా, కీర్తితో అతడు ప్రవర్తించిన తీరుకు సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అతడు ఎంత ట్రోలింగ్‌కు గురైనప్పటికీ బయట నుంచి సిరి.. శ్రీహాన్‌కు బాగానే సపోర్ట్ చేసింది. శ్రీహాన్ గెలిచేందుకు ఎంత చేయాలో అంత చేసింది. బిగ్‌బాస్ ఇంట్లోకి గెస్ట్‌గా వెళ్లినప్పుడు కూడా అతడికి మంచి సలహాలు ఇచ్చింది. ఇంట్లోకి వెళ్లినప్పుడు అతడితో రొమాన్స్ చేయడం, శ్రీహాన్ కోసం టాటూ వేయించుకోవడం అబ్బో నానా రచ్చ చేసి వార్తల్లో నిలిచింది సిరి. ప్రస్తుతం బయటకొచ్చిన తర్వాత కూడా వీలు చిక్కినప్పుడల్లా తమ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది.
తాజాగా సిరి తన అభిమానులతో ముచ్చటించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పలువురు ఆమెకు ఆసక్తికర ప్రశ్నలు సంధించగా సమాధానమిచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ సిరి-శ్రీహాన్ పెళ్లిపై ప్రశ్నించాడు. శ్రీహాన్‌ను మీరు పెళ్లి చేసుకోండి.. మాకు చూడాలని ఉంది. అని అడిగేశాడు. ఇందుకు సిరి కూడా త్వరలోనే చేసుకుంటామని బదులిచ్చింది. అయితే ఎప్పుడు చేసుకుంటారో అనేది మాత్రం క్లారిటీగా తేదీ చెప్పలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాదే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం సిరి-శ్రీహాన్ తమ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. వీరిద్దరు ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదే ఇది విడుదలయ్యే అవకాశాలున్నాయి.