తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mass Mogudu Song: వీర సింహా రెడ్డి నుంచి మాస్‌ మొగుడొచ్చాడు.. సాంగ్‌ అదుర్స్‌

Mass Mogudu Song: వీర సింహా రెడ్డి నుంచి మాస్‌ మొగుడొచ్చాడు.. సాంగ్‌ అదుర్స్‌

Hari Prasad S HT Telugu

09 January 2023, 21:16 IST

    • Mass Mogudu Song: వీర సింహా రెడ్డి నుంచి మాస్‌ మొగుడొచ్చాడు సాంగ్‌ సోమవారం (జనవరి 9) రిలీజైంది. ఈ మాస్‌ నంబర్‌ సినిమా రిలీజ్‌కు ముందే ఫ్యాన్స్‌కు సంక్రాంతి పండగను తీసుకొచ్చింది.
మాస్ మొగుడు పాటలో బాలకృష్ణ, శృతి హాసన్
మాస్ మొగుడు పాటలో బాలకృష్ణ, శృతి హాసన్

మాస్ మొగుడు పాటలో బాలకృష్ణ, శృతి హాసన్

Mass Mogudu Song: ఈసారి సంక్రాంతి పండగ మాస్‌ పండగ కానుంది. ఓవైపు బాలయ్య వీర సింహా రెడ్డి, మరోవైపు చిరంజీవి వాల్తేర్‌ వీరయ్య సినిమాలతో ఫ్యాన్స్‌ పండగ చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల ట్రైలర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాళ్లకు పండగ పూట కావాల్సిన అన్ని మసాలాలతో ఈ ట్రైలర్లు ఫ్యాన్స్‌ను ఆకర్షించాయి.

ట్రెండింగ్ వార్తలు

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

ఇక ఇప్పుడు బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి మూవీ నుంచి నాలుగో పాట రిలీజైంది. మాస్‌ మొగుడొచ్చాడే అంటూ సాగిన ఈ లిరికల్‌ వీడియో మరోసారి బాలయ్య ఫ్యాన్స్‌లో ఊపు తెప్పించింది. తమన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ పాట పక్కా మాస్‌ నంబర్‌గా ఉంది. ఈ పాటను మనో, రమ్య బెహరా పాడారు. ఇక లిరిక్స్‌ను రామ జోగయ్య శాస్త్రి అందించాడు. మాస్‌ మొగుడు పాటను సోమవారం (జనవరి 9) మేకర్స్‌ రిలీజ్ చేశారు.

ఈ మాస్‌ సాంగ్‌కు తగినట్లు బాలకృష్ణ, శృతి స్టెప్పులు ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12 రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీరిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ట్రైలర్‌ కూడా అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఉంది. బాలయ్య మార్క్‌ పంచ్‌ డైలాగులు, ప్రస్తుతం ఏపీలో ఉన్న పొలిటికల్‌ హీట్‌కు తన కౌంటర్‌ అన్నట్లుగా ఈ ట్రైలర్‌ సాగింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించింది. కన్నడ నటుడు దునియా విజయ్‌ ఇందులో విలన్‌గా నటించాడు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. గోపీచంద్‌ మలినేని ఈ మూవీకి డైరెక్టర్‌. ఇంతకుముందు వీర సింహా రెడ్డి నుంచి వచ్చిన మూడు పాటలు కూడా ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం