Srihan - Siri Hanmanth Web Series: లవర్ సిరితో శ్రీహాన్ వెబ్ సిరీస్ - శేఖ‌ర్ మాస్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌-bigg boss shrihan to team up with siri hanmanth for a web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss Shrihan To Team Up With Siri Hanmanth For A Web Series

Srihan - Siri Hanmanth Web Series: లవర్ సిరితో శ్రీహాన్ వెబ్ సిరీస్ - శేఖ‌ర్ మాస్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 25, 2022 10:17 AM IST

Srihan - Siri Hanmanth Web Series: బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ శ్రీహాన్ త‌న ల‌వ‌ర్ సిరితో క‌లిసి ఓ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సిరీస్‌కు ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అత‌డు ఎవ‌రంటే...

శ్రీహాన్‌, సిరి హ‌నుమంత్‌
శ్రీహాన్‌, సిరి హ‌నుమంత్‌

Srihan - Siri Hanmanth Web Series: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 ర‌న్న‌ర‌ప్‌గా శ్రీహాన్ నిలిచిన సంగ‌తి తెలిసింది. విన్న‌ర్ రేవంత్ కంటే శ్రీహాన్ ఎక్కువ ప్రైజ్‌మ‌నీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచే అవ‌కాశం శ్రీహాన్‌కే ఎక్కువ‌గా ఉండ‌గా నాగార్జున ఇచ్చిన ప్రైమ్‌మ‌నీని తీసుకొని ర‌న్న‌ర‌ప్ టైటిల్‌తో స‌రిపెట్టుకున్నాడు. ఈ బిగ్‌బాస్ రియాలిటీ షోలో త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్న శ్రీహాన్‌కు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లో మంచి అవ‌కాశాలు వ‌స్తోన్న‌ట్లు స‌మాచారం.

తాజాగా త‌న ల‌వ‌ర్ సిరి హ‌నుమంత్‌తో శ్రీహాన్ ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని శ్రీహాన్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత శ్రీహాన్ అంగీక‌రించిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ సిరీస్‌కు ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు శ్రీహాన్ పేర్కొన్నాడు. శేఖ‌ర్ మాస్ట‌ర్‌, సిరి, డైరెక్ట‌ర్‌ల‌తో క‌లిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు శ్రీహాన్‌. ఫుల్ ఫ‌న్‌తో ఈ వెబ్‌సిరీస్ సాగ‌నున్న‌ట్లు శ్రీహాన్ పేర్కొన్నాడు.

త్వ‌ర‌లోనే ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన వివ‌రాల్ని రివీల్ చేయ‌బోతున్న‌ట్లు తెలిపాడు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ సిరీస్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ వెబ్ సిరీస్ తో శ్రీహాన్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సిరితో చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్నాడు శ్రీహాన్‌. బిగ్‌బాస్ సీజ‌న్ 6 లో అత‌డి కోసం హౌజ్‌కు వ‌చ్చింది సిరి హ‌నుమంత్‌. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో సిరి, శ్రీహాన్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. గ‌తంలో కొన్ని వెబ్‌సిరీస్‌ల‌లో సిరి, శ్రీహాన్ క‌లిసి న‌టించారు.

IPL_Entry_Point