Siren Review: జయం రవి, అనుపమ పరమేశ్వరన్ తమిళ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
17 February 2024, 14:14 IST
Siren Review: జయం రవి, కీర్తిసురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ సైరన్ ఇటీవల థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు.
సైరన్ మూవీ రివ్యూ
Siren Review: జయంరవి(Jayam Ravi), కీర్తిసురేష్, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా తమిళ మూవీ సైరన్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు. పొన్నియన్ సెల్వన్ తర్వాత జయం రవి హీరోగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
పెరోల్‌పై విడుదలైన ఖైదీ కథ...
తన భార్య జెన్నీఫర్ (అనుపమ పరమేశ్వరన్)ను మర్డర్ చేసిన కేసులో తిలగన్‌కు(జయం రవి) యావజ్జీవ శిక్ష పడుతుంది. పెరోల్‌పై జైలు నుంచి బయటకు వస్తాడు. తిలగన్‌కు ఓ కూతురు (యువిన పార్థవీ) ఉంటుంది. ఖైదీ కూతురు అంటూ చిన్నతనం నుంచి అందరూ తనను ఎగతాళి చేయడంతో తిలగన్ ద్వేషిస్తుంటుంది అతడి కూతురు. తిలగన్ జైలు నుంచి పెరోల్‌పై ఇంటికి రావడంతో కూతురు అతడికి దూరంగా బంధువులు ఇంటికి వెళ్లిపోతుంది. పెరోల్‌పై విడుదలైన తిలగన్ రాజకీయంగా పలుకుబడి ఉన్న అజయ్‌తో పాటు మరో వ్యక్తిని చంపేస్తాడు.
సస్పెన్షన్ ముగించుకొని తిరిగి విధుల్లో చేరిన పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) ఈ పొలిటికల్ లీడర్స్ మర్డర్ కేసులను ఇన్వేస్టిగేట్ చేసే బాధ్యతల్ని చేపడుతుంది. ఈ హత్యలు చేసింది తిలగన్ అని అనుమానిస్తుంది నందిని.
ఆధారాలు లేకుండా తిలగన్ తెలివిగా హత్యలు చేయడంతో నందిని ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుంటుంది. అసలు అతడు జైలుకు ఎందుకు వెళ్లాడో తెలుసుకోవడం మొదలుపెడుతుంది ఆమె అన్వేషణలో ఏం తేలింది? అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసే తిలగన్‌కు యావజ్జీవ శిక్ష ఎందుకు పడింది?
ప్రేమించిన పెళ్లాడిన తన భార్య జెన్నిఫర్‌ను నిజంగానే తిలగన్ చంపేశాడా? పొలిటికల్ లీడర్స్‌పై తిలగన్ పగను పెంచుకోవడానికి కారణం ఏమిటి? ఐపీఎస్ ఆఫీసర్ నాగలింగంపై (సముద్రఖని) తిలగన్ ఎందుకు పగను పెంచుకున్నాడు. తిలగన్‌ను ఆధారాలతో నంది అరెస్ట్ చేసిందా? తిలగన్ మంచితనాన్ని అతడి కూతురు అర్థం చేసుకుందా? లేదా? అన్నదే సైరన్(Siren Review) మూవీ కథ.
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్...
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్ సైరన్ మూవీని తెరకెక్కించాడు. తన భార్య మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్‌తో పాటు పొలిటికల్ లీడర్స్‌పై ఓ సాధారణ అంబులెన్స్ డ్రైవర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ సినిమా(Siren Review) మెయిన్ పాయింట్.
ఈ రొటీన్ స్టోరీ చూట్టూ తండ్రీకూతుళ్ల ఎమోషన్ తో పాటు పోలీస్, కిల్లర్ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో డ్రామాను అల్లుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్‌గా సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.
జయం రవి క్యారెక్టరైజేషన్...
కథ పరంగా చూసుకుంటే సైరన్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. ఈ పాయింట్‌తో దక్షిణాది ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ స్క్రీన్‌ప్లేతో పాటు జయం రవి క్యారెక్టరైజేషన్ విషయంలో దర్శకుడు వైవిధ్యతను చూపించారు. జయం రవి క్యారెక్టర్‌ను సాల్ట్ పెప్పర్ లుక్‌లో డిఫరెంట్‌గా డిజైన్ చేసుకున్నాడు. మాస్ హీరోగా కాకుండా రియలిస్టిక్‌గా చూపిస్తూనే హీరో పాత్ర నుంచి హీరోయిజం పండించాడు.
ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో తప్ప సినిమా(Siren Review) మొత్తం జయం రవి మిడిల్ ఏజ్ వ్యక్తిగా కనిపిస్తాడు. కూతురి ప్రేమ కోసం ఆరాటపడే తండ్రిగా జయంరవి, యువీన సీన్స్ ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ను ఒకేసారి స్క్రీన్‌పై చూపించాలనే దర్శకుడి ఆలోచన బాగుంది. తండ్రీ కూతుళ్ల బాండింగ్ సీన్స్ ఈ సినిమా ప్లస్సయ్యాయి.
క్యాస్టిజం ఈష్యూ...
జయంరవి, అనుపమ పరమేశ్వరన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో(Siren Review) ఎలాంటి కొత్తదనం లేదు. అగ్ర కులానికి చెందిన అమ్మాయి, తక్కువ కులానికి చెందిన అబ్బాయి ప్రేమకథ అంటూ అవుడ్‌డేటెట్ పాయింట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అంది అంతగా ఆకట్టుకోదు. అనుపమ పరమేశ్వరన్ పాత్రను మూగ, చెవిటిగా చూపించడానికి కారణం ఏమిటో అంతగా అంతుపట్టదు. అందుకు సంబంధించి వచ్చే లాజిక్ కూడా ఇంప్రెసివ్‌గా అనిపించవు.
ఆసక్తి మిస్...
సెకండాఫ్ మొత్తం జయం రవి, కీర్తిసురేష్ పాత్రల నేపథ్యంలో కథ సాగుతుంది. జయం రవి చేసే హత్యలకు సంబంధించిన ఆధారాల్ని కీర్తిసురేష్ కనిపెట్టే ఎపిసోడ్స్ ఆసక్తి లోపించింది. కీర్తి సురేష్ పాత్రలో చాలా చోట్ల లాజిక్స్ కనిపించవు. హడావిడి తప్పితే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఉన్నంతనంలో యోగిబాబు కామెడీనే కొంత రిలీఫ్‌గా అనిపిస్తుంది.
కీర్తిసురేష్ సర్‌ప్రైజ్...
తిలగన్ పాత్రలో జయం రవి క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ కొత్తగా ఉన్నాయి. లుక్ పరంగా గత సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో అతడి నటన బాగుంది. పోలీస్ ఆఫీసర్‌గా కీర్తిసురేష్ రోల్ ఈ సినిమాకు సర్‌ప్రైజింగ్‌గా నిలిచింది. అయితే నటన పరంగా ఛాలెజింగ్‌గా నిలిచే క్యారెక్టర్ మాత్రం కాదనిపిస్తుంది. అనుపమ పరమేశ్వరన్ గెస్ట్ రోల్‌లో కనిపించింది. అజయ్ విలనిజం రొటీన్‌గా ఉంది.
Siren Review - జయం రవి యాక్టింగ్ కోసం...
సైరన్ రొటీన్ రివేంజ్ డ్రామా మూవీ. జయం రవి, కీర్తి సురేష్ యాక్టింగ్ కోసం సైరన్‌ను చూడొచ్చు.