samantha | సమంత బర్త్‌డే సర్‌ప్రైజ్...శాకుంతలం స్పెషల్ పోస్టర్ రిలీజ్
28 April 2022, 9:33 IST
సమంత పుట్టినరోజు సందర్భంగా శాకుంతలం టీమ్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ను అందించింది. ఆమె స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
సమంత
సమంత కథానాయికగా మైథలాజికల్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతం లోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శకుంతలగా టైటిల్ పాత్రలో సమంత కనిపించబోతున్నది. సమంత పుట్టినరోజు సందర్భంగా గురువారం స్సెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో తెలుపు రంగు చీరలో దేవకన్యలా మెరిసిపోతూ సమంత కనిపిస్తోంది. తలతో పాటు చేతులకు మల్లెపూల మాలలను ధరించి డిఫరెంట్ గా ఆమె లుక్‌ను డిజైన్ చేశారు.
ఇటీవలే తన పాత్రకు సంబంధించి సమంత డబ్బింగ్ ను పూర్తిచేసుకున్నది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. దిల్‌రాజు సమర్పణలో గుణశేఖర్ తనయ నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్‌మోహన్ కనిపిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
టాపిక్