Shakira Video: పొట్టి డ్రెస్ వేసుకొని పర్ఫార్మెన్స్.. కింది నుంచి వీడియో తీసిన అభిమాని.. స్టార్ సింగర్‌కు చేదు అనుభవం
16 September 2024, 15:48 IST
- Shakira Video: స్టార్ సింగర్ షకీరాకు చేదు అనుభవం ఎదురైంది. పొట్టి డ్రెస్ వేసుకొని స్టేజ్ పై పర్ఫార్మ్ చేస్తుండగా.. ఓ అభిమాని ఆమె కాళ్ల మధ్యలో నుంచి వీడియో షూట్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె షో మధ్యలోనే స్టేజ్ దిగి వెళ్లిపోయింది.
పొట్టి డ్రెస్ వేసుకొని పర్ఫార్మెన్స్.. కింది నుంచి వీడియో తీసిన అభిమాని.. స్టార్ సింగర్‌కు చేదు అనుభవం
Shakira Video: ఎంత పెద్ద స్టార్ అయినా సరే పబ్లిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చే సమయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అభిమానుల అతి వల్ల తరచూ సెలబ్రిటీలు ఇబ్బంది పడటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా స్టార్ కొలంబియన్ సింగర్ షకీరాకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఓ లైవ్ కాన్సెర్ట్ లో ఆమె షార్ట్ డ్రెస్ వేసుకొని పర్ఫార్మ్ చేస్తుండగా.. ఓ అభిమాని అసభ్యంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు.
షకీరాకు చేదు అనుభవం
కొలంబియన్ పాప్ స్టార్ షకీరాకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తన సింగింగ్ తోపాటు అందంతోనూ ఆమెను ఆకర్షిస్తుంది. అయితే తాజాగా ఆమె అమెరికాలోని ఓ నైట్‌క్లబ్ లో తన రాబోయే ట్రాక్ సోల్టేరాపై పర్ఫార్మ్ చేస్తున్న సమయంలో ఓ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది.
ఓ పొట్టి డ్రెస్ వేసుకొని ఆమె స్టేజ్ పై డ్యాన్స్ చేస్తోంది. ఆ సమయంలో కింద ఉన్న అభిమాని ఒకరు తన కాళ్ల మధ్యలో నుంచి ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె గుర్తించింది. వెంటనే అతన్ని అలా చేయొద్దంటూ వారిస్తూ తన డ్రెస్ కాస్త కిందికి లాక్కుంది.
అయినా అతడు వినకుండా అలాగే వీడియో తీస్తూనే ఉన్నాడు. దీంతో ఆమె డ్యాన్స్ మధ్యలోనే ఆపేసి స్టేజ్ దిగి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్లోరిడాలోని లివ్ మియామీ నైట్‌క్లబ్ లో ఈ ఘటన జరిగింది.
షకీరా వీడియో వైరల్
షకీరాకు చెందిన ఈ వీడియోను పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. "తన కొత్త పాటపై షకీరా డ్యాన్స్ చేస్తుండగా.. కొందరు తన డ్రెస్ కింది నుంచి వీడియోలు తీస్తున్నట్లుగా గుర్తించి స్టేజ్ నుంచి దిగిపోయింది" అనే క్యాప్షన్ తో ఓ యూజర్ పోస్ట్ చేశాడు. అది కాస్తా వెంటనే వైరల్ అయింది.
ఇది చాలా దారుణమైన ప్రవర్తన అంటూ ఈ వీడియోపై పలువురు స్పందిస్తున్నారు. షకీరా చేసిందాంట్లో తప్పేమీ లేదని.. అలాంటి అగౌరవాన్ని ఎవరూ సహించలేరని మరో అభిమాని కామెంట్ చేశారు. ఇది కూడా ఓ రకంగా లైంగిక దాడి కిందికే వస్తుందని, వాళ్లు అన్ని హద్దులూ దాటేశారని మరికొరు అన్నారు.
క్వీన్ ఆఫ్ లాటిన్ మ్యూజిక్ గా షకీరాకు పేరుంది. ఆమె తన కెరీర్లో ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించింది. వెనెవర్ వేరెవర్, హిప్స్ డోన్ట్ లై, లా టార్చురా, బ్యూటీఫుల్ లయర్, షి వోల్ఫ్ లాంటివి అందులో ఉన్నాయి. ఇవే కాకుండా 2010లో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా ఆమె క్రియేట్ చేసిన వాకా వాకా థీమ్ సాంగ్ మొత్తం ప్రపంచాన్ని ఊపేసింది.