తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shahid Kapoor : రూ.500లకు షాహిద్, కరీనా నైట్ క్లబ్‌ కిస్ ఫొటో లీక్.. షాహిద్ కపూర్ ఏమన్నాడంటే

Shahid Kapoor : రూ.500లకు షాహిద్, కరీనా నైట్ క్లబ్‌ కిస్ ఫొటో లీక్.. షాహిద్ కపూర్ ఏమన్నాడంటే

Anand Sai HT Telugu

10 July 2023, 12:22 IST

google News
    • Shahid Kapoor On Kiss : నటుడు షాహిద్ కపూర్, కరీనా కపూర్ గురించి అప్పట్లో వార్తలు తెగ వచ్చేవి. 2004లో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న ఫొటో బయటకు వచ్చింది. తాజాగా దీనిపై మాట్లాడాడు షాహిద్ కపూర్.
షాహిద్ కపూర్, కరీనా కపూర్(పాత చిత్రం)
షాహిద్ కపూర్, కరీనా కపూర్(పాత చిత్రం) (Twitter)

షాహిద్ కపూర్, కరీనా కపూర్(పాత చిత్రం)

షాహిద్ కపూర్(Shahid Kapoor), కరీనా కపూర్(Kareena Kapoor) అనుబంధం గురించి బాలీవుడ్లో అందరికీ తెలిసిందే. ఇదేమీ కొత్త విషయం కాదు. వారిద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేసి విడిపోయారు. కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకోగా, షాహిద్ మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్నాడు. కరీనా అక్టోబర్ 2012 లో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. 2016 లో తైమూర్ అలీ ఖాన్, 2021లో జహంగీర్ అలీ ఖాన్‌కు జన్మనిచ్చింది.

షాహిద్ కపూర్ మార్చి 2015లో మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్నాడు 2016లో కుమార్తె మిషా కపూర్, 2018లో కుమారుడు జైన్ కపూర్‌ పుట్టారు. అయితే షాహిద్, కరీనా ప్రేమకథ(Shahid-Kareena Love Story) చాలా ఆసక్తికరంగా సాగింది. అందులోని ఒక అంశం ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. అదేంటంటే.. వారి ముద్దు గురించి.

చాలా ఏళ్ల క్రితం షాహిద్, కరీనా ముద్దులు(Shahid Kareena Kiss) పెట్టుకున్న ఓ ఫోటో వైరల్‌గా మారింది. చాలా సంవత్సరాల తర్వాత, షాహిద్ ఈ సంఘటన గురించి మాట్లాడాడు. నిజానికి ఇది 2004లో జరిగింది. షాహిద్ కపూర్, కరీనా కపూర్ ముంబైలోని ఒక నైట్ క్లబ్‌లో ముద్దులో నిమగ్నమయ్యారు. ఈ లిప్‌లాక్ ఫోటో మరుసటి రోజు ఒక వార్తాపత్రికలో ప్రచరితమైంది. ఇది అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా లేకపోయినా.. అంత స్పీడ్ గా ఈ వార్త వ్యాపించింది.

20 ఏళ్ల తర్వాత షాహిద్ కపూర్ ఎట్టకేలకు దీనిపై మౌనం వీడాడు. ఈ ఘటన తనపై ఎంతగానో ప్రభావం చూపిందని చెప్పాడు. అప్పటికి అతని వయస్సు కేవలం 24 సంవత్సరాలు. ఈ ఘటన అప్పట్లో తనపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నాడు. తన గోప్యతపై దాడి జరిగిందని, కానీ దాన్ని కాపాడేందుకు తానేమీ చేయలేకపోయానని తెలిపాడు.

'ఆ సమయంలో కుంగిపోయాను. నేను కేవలం 24 సంవత్సరాల యువకుడిని. నా గోప్యతపై దాడి జరిగింది. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తర్వాత ఏం జరుగుతుందోనని భయపడ్డాను. నా జీవితంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇది నన్ను చాలా తప్పుగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఆ వయసులో ఇద్దరం మా ఫీలింగ్స్‌ని అర్థం చేసుకునే దశలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కెమెరా ద్వారా తీసిన ఈ ఫోటోలను ఇద్దరు అబ్బాయిలు వార్తాపత్రికకు ఇచ్చారు. ఈ ఫోటో 500 రూపాయలకు ఇచ్చేశారు.' అని షాహిద్ తెలిపాడు. ఆ ఫొటో ప్రచురితమవడంతో ఆ పత్రికపై కేసు కూడా పెట్టినట్లు చెప్పాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం