Doctor G Trailer: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ జి. ఈ మూవీలో ఓ మేల్ గైనకాలజిస్ట్‌గా ఆయుష్మాన్ కనిపిస్తున్నాడు. ఎంతో సరదాగా సాగిపోయే ఈ డాక్టర్ జి మూవీ ట్రైలర్ మంగళవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరూ అమ్మాయిలు ఉండే గైనకాలజీ సెక్షన్‌లో ఓ అబ్బాయి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఈ డాక్టర్ జి మూవీలో ఆయుష్మాన్ ఖురానీ పరిస్థితీ అలాగే ఉంది. డాక్టర్ ఉదయ్ గుప్తాగా కనిపించిన ఆయుష్మాన్ ఓ మేల్ గైనకాలజిస్ట్‌గా నటించాడు. అయితే అమ్మాయిలు ఓ మేల్ డాక్టర్‌తో అంత సౌకర్యవంతంగా ఉండలేరన్న నిజం అతనికి ముందుగానే తెలుసొస్తుంది. తాను చేయాల్సింది చేసినందుకు కూడా ఓ పేషెంట్ భర్త చేతిలో తన్నులు తింటాడు డాక్టర్ ఉదయ్ గుప్తా.
ఎలాగైనా తన స్పెషలైజేషన్ మార్చుకోవాలని ప్రయత్నించి విఫలమవుతూ.. ఇష్టం లేకపోయినా అలాగే గైనకాలజిస్ట్‌గా కొనసాగే పాత్రలో ఆయుష్మాన్ మెప్పించాడు. "నా దగ్గర లేని శరీర భాగాలను నేనెలా ట్రీట్ చేయగలను" అంటూ ఈ ట్రైలర్‌లో అతడు చెప్పే డైలాగ్ ఒకటి నవ్వు తెప్పిస్తుంది. ఈ మూవీలో రకుల్‌ప్రీత్ అతనికి జోడీగా నటించింది. ఇందులో డాక్టర్ ఫాతిమాగా కనిపిస్తోంది.
ఈ ట్రైలర్‌లో ఆయుష్మాన్, రకుల్ మధ్య ఓ హాట్ లిప్‌లాక్ సీన్ కూడా ఉంది. ఇక మూవీలో డాక్టర్ ఉదయ్ గుప్తా టీచర్ డాక్టర్ నందినిగా సీనియర్ బాలీవుడ్ నటి షెఫాలీ సా కనిపించింది. నువ్వు గైనకాలజిస్ట్‌గా కొనసాగాలంటే ముందు ఆ మేల్ టచ్‌ను కోల్పోవాలంటూ ఆమె చెబుతుంది. దాదాపు 2 నిమిషాల 55 సెకన్ల ట్రైలర్ అంతా సరదాగా సాగినా.. ఒక్కచోట మాత్రం నీ తప్పు వల్ల ఓ పేషెంట్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదంటూ ఆయుష్మాన్‌కు షెఫాలీ క్లాస్ తీసుకుంటుంది.
ఈ డాక్టర్ జి మూవీ ట్రైలర్‌ను అటు ఆయుష్మాన్ ఖురానా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇలాంటి క్యారెక్టర్లను అలవోకగా పోషించే అతడు.. తనదైన నటనతో డాక్టర్ జిలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నాడు. అనుభూతి కశ్యప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 14న రిలీజ్ కానుంది.
టాపిక్