తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaakuntalam Trailer: లేడి కన్నులు.. సివంగి నడుము.. సమంత శాకుంతలం రెండో ట్రైలర్ చూశారా?

Shaakuntalam Trailer: లేడి కన్నులు.. సివంగి నడుము.. సమంత శాకుంతలం రెండో ట్రైలర్ చూశారా?

Hari Prasad S HT Telugu

05 April 2023, 19:38 IST

    • Shaakuntalam Trailer: లేడి కన్నులు.. సివంగి నడుముతో సమంత కనిపిస్తున్న శాకుంతలం సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
శాకుంతలం మూవీలో సమంత, దేవ్ మోహన్
శాకుంతలం మూవీలో సమంత, దేవ్ మోహన్

శాకుంతలం మూవీలో సమంత, దేవ్ మోహన్

Shaakuntalam Trailer: సమంత రుత్ ప్రభు నటించిన మైథలాజికల్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్నోసార్లు వాయిదా పడి ఊరిస్తున్న ఈ సినిమా.. మొత్తానికి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్లను జోరుగా మొదలుపెట్టారు. తాజాగా బుధవారం (ఏప్రిల్ 5) శాకుంతలం రెండో ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఈ సినిమాలో శకుంతలగా సమంత కనిపిస్తుండగా.. దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. ఇప్పటికే వచ్చిన తొలి ట్రైలర్ గుణశేఖర్ మార్క్ చూపించగా.. తాజాగా వచ్చిన రెండో ట్రైలర్ దానిని మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ ట్రైలర్ లో శకుంతల, దుశ్యంతుడి మధ్య లవ్ స్టోరీని చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు.

మామూలుగానే గుణశేఖర్ సినిమాలు భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. ఈ శాకుంతలం కూడా అందుకు భిన్నమేమీ కాదు. ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. ఇందులోని విజువల్స్, గ్రాఫిక్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాలనుకున్నా.. 3డీలోనూ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేశారు.

ఇప్పుడీ శాకుంతలం 2డీ, 3డీల్లో రిలీజ్ కాబోతోంది. జనవరిలో వచ్చిన తొలి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినట్లే.. ఈ రెండో ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు కూడా అలరిస్తున్నాయి. శాకుంతలం మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది.

కాళిదాసు రచించిన అభిఙ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విశ్వామిత్రుడి పాత్రలో మోహన్ బాబు నటించాడు. ప్రకాశ్ రాజ్, మధుబాల, కబీర్ బేడి, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కూతురు అర్హ తెరంగేట్రం చేస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం