Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్
16 May 2024, 15:02 IST
Scam 2010 Web Series: స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా అంటూ డైరెక్టర్ హన్సల్ మెహతా కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేశాడు. ఇప్పటికే స్కామ్ 1992, స్కామ్ 2003 అంటూ ఇండియాలో జరిగిన రెండు అతిపెద్ద స్కామ్ ల గురించి అతడు వెబ్ సిరీస్ తీసిన విషయం తెలిసిందే.
స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్
Scam 2010 Web Series: స్కామ్ వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎడిషన్ వచ్చేస్తోంది. స్కామ్ 1992, స్కామ్ 2003ల దారిలోనే స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా అనే టైటిల్ తో డైరెక్టర్ హన్సల్ మెహతా గురువారం (మే 16) కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేశాడు. సహారా సంస్థల అధినేతగా పేరుగాంచిన వ్యాపారవేత్త దివంగత సుబ్రతా రాయ్ స్టోరీని ఈ సిరీస్ ద్వారా అతడు చెప్పబోతున్నాడు.
స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా
బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా ఇప్పటికే సోనీలివ్ లో స్కామ్ 1992, స్కామ్ 2003 పేరుతో రెండు వెబ్ సిరీస్ లు తీసుకొచ్చిన విషయం తెలుసు కదా. మొదటిదేమో 1992లో బయటపడిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ కాగా.. రెండోది 2003లో సంచలనం రేపిన అబ్దుల్ కరీం తెల్గీ స్టాంప్ పేపర్ స్కామ్. ఈ రెండింటికీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఇప్పుడు సుబ్రతా రాయ్ సహారా స్కామ్ ఆధారంగా స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా తీస్తున్నట్లు హన్సల్ వెల్లడించాడు. తమల్ బందోపాధ్యాయ రాసిన సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సోనీలివ్ ఓటీటీ వెబ్ సిరీస్ ను అప్లౌజ్ ఎంటర్‌టైన్మెంట్, స్టూడియో నెక్ట్స్ నిర్మిస్తుండగా.. హన్సల్ మెహతా డైరెక్ట్ చేస్తున్నాడు.
స్కామ్ 2010 స్టోరీ ఏంటి?
దేశాన్ని కుదిపేసిన స్కామ్ ల తెరవెనుక స్టోరీలను అందిస్తూ ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు డైరెక్టర్ హన్సల్ మెహతా. ఇప్పటికే అలాంటి రెండు స్కామ్ లు ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు స్కామ్ 2010 కూడా రానుంది. సహారా సంస్థల అధినేత అయిన సుబ్రతా రాయ్ పై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే 2014లో ఆయనను అరెస్ట్ చేశారు.
ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే రూ.25 వేల కోట్ల మొత్తం ప్రభుత్వ అధికార వర్గాల దగ్గర అలాగే ఉంది. దీనిపై హన్సల్ స్పందిస్తూ.. "స్కామ్ నాకు కేవలం ఓ ఫ్రాంఛైజీ మాత్రమే కాదు. మన కాలంలో జరిగిన వృత్తాంతాన్ని చెప్పడం. అలాంటిదే మరో గొప్ప స్టోరీ కోసం మరోసారి అప్లౌజ్, సోనీలివ్ లతో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది" అని అన్నాడు.
స్కామ్ సిరీస్‌లు చూశారా?
స్కామ్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన రెండు వెబ్ సిరీస్ లు గతంలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండూ సోనీలివ్ ఓటీటీలోనే ఉన్నాయి. ముఖ్యంగా స్కామ్ 1992 అయితే ఇప్పటికే ఇండియాలో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ ఉన్న వెబ్ సిరీస్ కావడం విశేషం. హర్షద్ మెహత్ స్టాక్, మనీ మార్కెట్ స్కామ్ లను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సిరీస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
తర్వాత గతేడాది స్కామ్ 2003 పేరుతో ఆ ఏడాది జరిగిన స్టాంప్ పేపర్ కుంభకోణం తెర వెనుక స్టోరీ చెప్పారు. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడైన అబ్దుల్ కరీమ్ తెల్గీ.. ఓ సాదాసీదా స్టాంప్ వెండర్ స్థాయి నుంచి దేశంలోనే అతిపెద్ద స్టాంప్ పేపర్ స్కామ్ (సుమారు రూ.30 వేల కోట్లు) ఎలా చేశాడో ఈ వెబ్ సిరీస్ కళ్లకు కట్టింది. ఇప్పుడు స్కామ్ 2010 సహారా స్కామ్ వెనుక ఉన్న ఏ తెలియని కోణాన్ని బయటపెడుతుందో అన్న ఆసక్తి నెలకొంది.