తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkaru Vaari Paata | మహేష్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. సర్కారువారి పాట నుంచి అప్‌డేట్‌

Sarkaru Vaari Paata | మహేష్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. సర్కారువారి పాట నుంచి అప్‌డేట్‌

HT Telugu Desk HT Telugu

12 April 2022, 16:55 IST

google News
    • జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ట్రిపుల్‌ ఆర్‌తో ఖుష్‌ అయిపోయారు. ఇక ఇప్పుడు ప్రిన్స్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట అంటూ తన ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్నాడు.
సర్కారు వారి పాటలో మహేష్ బాబు
సర్కారు వారి పాటలో మహేష్ బాబు

సర్కారు వారి పాటలో మహేష్ బాబు

కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ ఇప్పుడు వరుసగా రిలీజ్‌కు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ట్రిపుల్‌ ఆర్‌ మూవీ సంచలనాలు సృష్టించగా.. కేజీఎఫ్‌2 ఈ వారంలోనే రాబోతోంది. ఇక ఈ నెల చివర్లో ఆచార్య మెగా ఫ్యాన్స్‌ను సంబరాల్లో ముంచనుంది. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట మూవీ నుంచి కూడా ఓ అప్‌డేట్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌కు సరిగ్గా నెల రోజుల ముందు మంగళవారం ఈ అప్‌డేట్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

ఒక పాట మినహా సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయినట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. ఆ ఒక్క పాటను కూడా త్వరలోనే చిత్రీకరించనున్నట్లు చెప్పింది. థమన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ సూపర్‌హిట్‌ టాక్‌ కొట్టేశాయి. కళావతి పాటైతే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఆ పాటలో మహేష్‌ వేసిన స్టెప్స్‌కు చాలా మంది ఫిదా అయ్యారు. మరెంతో మంది ఆ స్టెప్స్‌ వేయడానికి ప్రయత్నించారు.

ఇక ప్రిన్స్‌ కూతురు సితార స్పెషల్‌ అప్పియరెన్స్‌తో వచ్చిన మరో పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వచ్చే నెల 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. దీంతో సినిమా యూనిట్‌ ప్రమోషన్ల వేగం పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మరొక్క పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు ఓ అప్‌డేట్‌ను మహేష్‌ ఫ్యాన్స్‌కు ఇచ్చింది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేపట్టాలని నిర్ణయించారు. సర్కారు వారి పాటలో మహేష్‌ సరసన కీర్తి సురేశ్‌ నటించిన విషయం తెలిసిందే. పరుశురాం దర్శకత్వం వహించాడు.

తదుపరి వ్యాసం