Salman Khan: సల్మాన్‌ను అంకుల్ అనేసిన స్టార్ హీరోయిన్.. అసలేం జరిగిందో తెలుసా?
24 June 2022, 20:26 IST
- బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్.. సల్మాన్ ఖాన్‌ను అంకుల్ అనేసింది. ఐఫా అవార్డుల ప్రధానోత్సవంలో వ్యాఖ్యతలుగా వ్యవహరించిన వీరు ఒకరిపై ఒకరు జోకులు పేల్చుకున్నారు.
సల్మాన్-సారా అలీ ఖాన్
ఐఫా 2022 అవార్డుల ప్రధానోత్సవం ఇటీవలే జరిగింది. ఈ షో శనివారం నాడు టీవీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ ఐఫా నిర్వాహకులు ఈ షో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయనకు తోడు బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్ వ్యాఖ్యతగా చేసింది. వీరిద్దరు తమ హోస్టింగ్‌తో వేదికపై అలరించారు. కామెడీ పంచులు విసురుకుంటూ ఉల్లాసాన్ని నింపారు. అయితే ఇందులో భాగంగా సల్మాన్‌ను సారా అంకుల్ అనేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
వీడియో గమనిస్తే.. సారా కొన్ని బ్రాండ్లను లాంచ్ చేయాలనుకుంటుంది. అనంతరం ఈ బ్రాండ్లను సల్మాన్ అంకుల్‌తో కలిసి విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతుంది. దీంతో సల్మాన్ కొంచెం కోపంతో.. నీ సినిమా ఫ్లాఫ్ అవుతుందని రిప్లయి ఇస్తాడు. నా సినిమా ఎందుకు ఫ్లాఫ్ అవుతుంది అని సారా.. సల్మాన్‌ను అడుగ్గా.. అందుకు అతడు.. తనను అందరి ముందు అంకుల్ అని పిలిచావు కాబట్టి నీ సినిమా పోతుందని చెప్పాడు. అదేంటి మీరే కదా నన్ను అంకుల్ అనమని అడిగారని సారా.. సల్మాన్‌ను ప్రశ్నిస్తుంది. దీంతో ఇద్దరూ టన్ టనా టన్ టన్ అనే పాటకు స్టెప్పులేస్తారు. ఈ పాట 1997లో సల్మాన్ నటించిన జుడ్వా చిత్రంలో సాంగ్.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. వాళ్లు ఎప్పుడూ వేదికపై మ్యాజిక్ క్రియేట్ చేస్తారు అని ఒకరు కామెంట్ చేయగా.. సారా క్యూట్‌గా ఉందని మరోకరు స్పందించారు. సారా, సల్మాన్‌కు కోపం తెప్పించిందని ఇంకొకరు పోస్ట్ చేశారు.
ఐఫా 2022 వేడుక అబుదాబీ వేదికగా జూన్ 2 నుంచి 4 మధ్య జరిగింది. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్, మనీశ్ పాల్ వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. అభిషేక్ బచ్చన్, టైగర్ ష్రాఫ్, అనన్య పాండే, సారా అలీ ఖాన్, నోరా ఫతేహి, తనిష్క్ బాగ్చీ, నేహ కక్కర్, హనీ సింగ్, గురు రాంధ్వా తదితరులు పర్ఫార్మెన్స్ చేశారు.
టాపిక్