Yashoda Trailer Release: యశోద ట్రైలర్ వచ్చేసింది.. సమంత యాక్టింగ్ అదుర్స్
27 October 2022, 19:03 IST
- Yashoda Trailer Release: సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం యశోద. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
యశోద ట్రైలర్ లాంచ్
Yashoda Trailer Release: టాలీవుడ్ స్టార్ హీరో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి. హరి-హరీష్ ఈ చిత్రానికి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్ర ట్రైలర్‌ను టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా అని సమంత అడిగే సంభాషణతో మొదలైన ట్రైలర్‌తో ఆద్యంతం ఆసక్తి సాగింది. సరోగసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. సరోగసి పేరుతో కొంతమంది వ్యక్తులు చేసే మోసాలు, అన్యాయాలకు పాల్పడటం.. విషయం తెలుసుకున్న సామ్ వారిపై పోరాడటం ఈ ట్రైలర్‌లో కనిపిస్తోంది. యశోధ అంటే ఎవరో తెలుసుగా అంటూ సమంత చేప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హరి-హరీష్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఎం సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కానుంది.