Yashoda Release Date: సమంత 'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్
Yashoda Release Date: సమంత 'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను నవంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Yashoda Release Date: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన మూవీ యశోద. హరి-హరీష్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పటికే ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా మేకర్స్ సోమవారం (అక్టోబర్ 17) ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వినూత్నంగా అనౌన్స్ చేశారు.
ఈ మూవీలో సమంత ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి.. అందులో రెండు బ్లాక్స్‌ను ఖాళీగా వదిలేశారు. వాటిని పూర్తి చేస్తే రిలీజ్ డేట్ వస్తుందని చెప్పారు. దీనికి ఓ లింక్ కూడా ఇచ్చారు. అందులోకి వెళ్లి వాటిని పూర్తి చేయగానే రిలీజ్ డేట్ తెలిసిపోయింది.
ఈ పాన్ ఇండియా మూవీని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు.
ఈ మూవీ టీజర్ ఇప్పటికే ఎంతో ఆసక్తి రేపింది. ఇందులో కంగ్రాచ్యులేషన్స్ నువ్వు ప్రెగ్నెంట్. మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ డాక్టర్.. సమంతకు సలహాలు ఇస్తూ కనిపిస్తోంది. నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి అంటూ డాక్టర్ చెబుతున్నప్పుడే సమంత అడవిలో నుంచి పరిగెత్తుతున్నట్లుగా టీజర్ లో చూపించారు.
బరువులు ఎత్తకూడదని చెప్పగానే వెయిట్ లిఫ్టింగ్ రాడ్ ఎత్తడానికి సమంత ప్రయత్నించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏ పని చేసిన దెబ్బ తగలకుండా చూసుకోవాలని అనగానే సమంత శత్రువులతో ఫైట్ చేస్తూ కనిపిస్తోంది. డాక్టర్ చెప్పిన సలహాలకు పూర్తి భిన్నంగా ఆమెకు ఎదురైన పరిణామాలతో టీజర్ ను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. ప్రెగ్నెంట్ ఉమెన్ గా సమంత పాత్ర పవర్ ఫుల్ గా టీజర్ లో కనిపిస్తోంది. తనకు ఎదురైన కఠిన పరిస్థితులను ఎదురించి పోరాడే మహిళగా ఆమె కనిపించబోతున్నది.
యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్ అంశాలతో ఉత్కంఠభరితంగా టీజర్ సాగింది. ఈ టీజర్ లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్ కనిపించాడు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి హరీ, హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తో పాటు హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.