Samantha Nervous on Yashoda: యశోద విడుదలకు ముందు ఆందోళనలో సామ్.. చిత్రంపై ఉత్కంఠ
10 November 2022, 15:35 IST
- Samantha Nervous on Yashoda: సమంత నటించిన తాజా చిత్రం యశోద. ఈ చిత్రం నవంబరు 11 శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు సామ్.. తాను ఆందోళనలో ఉన్నట్లు పోస్ట్ చేసింది.
సమంత
Samantha Nervous on Yashoda: టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. అయితే ఆమె నటించిన యశోద చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో చిత్ర ప్రమోషన్లలోనూ పాల్గొంటోంది. తాజాగా ఈ సినిమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సినిమా విడుదలకు ముందు తనకు ఆందోళనగా ఉందంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఇంకా ఒక్క రోజే ఉంది. చాలా ఆందోళనగా ఉంది. ఇదే సమయంలో ఉత్కంఠగానూ ఉంది. మీ అందరికీ యశోద నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నా. మా డైరెక్టర్లు, నిర్మాతలు, ఇతర నటీ, నటుల నుంచి సానుకూలత కనిపిస్తోంది. రేపు విడుదల కానున్న సినిమాపై వారు బాగా నమ్మకంగా ఉన్నారు. సినిామ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అంటూ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ పోస్టుపై విశేషంగా స్పందిస్తున్నారు. ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. మీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారని, ఎల్లప్పుడూ మీమల్ని గౌరవిస్తామని, అలాగే యశోద సినిమా సూపర్ హిట్టవుతుందని పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. మహిళా ప్రధాన చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కథలకు కొరత ఉందని నేను అనుకోను. చాలా స్టోరీలు మహిళల కోసం రాశారు. అయితే ఇక్కడ నిజంగా ఈ సినిమాలు చూసేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. మహిళల ప్రధాన చిత్రాలు ఎందుకు? అని తరచూ వస్తున్న ప్రశ్నలపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అని సామ్ తెలిపారు.
సమంత ప్రధాన పాత్ర పోషించిన యశోద చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హరి-హరీష్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.
టాపిక్