samantha | నా నిశ్శబ్దాన్ని అజ్ఞానం అనుకోవద్దు...వైరల్ గా మారిన సమంత ట్వీట్
22 April 2022, 18:21 IST
తన దయాగుణాన్ని బలహీనతగా భావించవద్దని వార్నింగ్ ఇస్తోంది కథానాయిక సమంత. సోమవారం తాత్విక ధోరణిలో ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది సమంత. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
సమంత
నాగచైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఫిలాసఫికల్కోట్స్ ఎక్కువగా పోస్ట్ చేస్తోంది సమంత. తన మానసిక స్థితి, సంఘర్షణతో పాటు తనపై వచ్చే విమర్శలకు ఈ కోట్స్ ద్వారా బదులిస్తోంది. తాత్విక ధోరణిలో సమంత చేస్తున్న ఈ పోస్ట్ లలో చాలా లోతైన అర్థాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వారికి ఈ కోట్స్ ద్వారా సమంత బదులిస్తున్నట్లుగా చెబుతున్నారు.
శుక్రవారం మరోసారి ట్విట్టర్‌లో సమంత ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ‘నా నిశ్శబ్దాన్ని అజ్ఞానంగా భావించవద్దు. నా ప్రశాంతతను అంగీకారం అనుకోవద్దు. నా దయార్థ హృదయాన్ని బలహీనతగా భావించవద్దు’ అంటూ సమంత ట్వీట్ చేసింది.మరికొద్ది సమయం తర్వాత దయాగుణానికి కూడా ఎక్సైపైరీ డేట్ ఉంటుందని మరో ట్వీట్ చేసింది. సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత ఎవరికి వార్నింగ్ ఇచ్చిందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె మాటల వెనుక ఉన్న అర్థం ఏమిటనేది అంతుపట్టడం లేదని అభిమానులు అంటున్నారు. సమంతకు అంతగా నచ్చని పని ఎవరూ చేశారో నని మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం,యశోద సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే విజయ్‌దేవరకొండతో ఓ సినిమాను అంగీకరించింది. తమిళంలో ఆమె నటించిన కాథు వాకుల రెండు కాదల్ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
టాపిక్