తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yashoda Day 1 Collections: తొలి రోజే యశోద చిత్రానికి పాజిటివ్ టాక్.. కలెక్షన్లు ఎంతంటే?

Yashoda Day 1 Collections: తొలి రోజే యశోద చిత్రానికి పాజిటివ్ టాక్.. కలెక్షన్లు ఎంతంటే?

11 November 2022, 22:38 IST

google News
    • Yashoda Day 1 Collections: సమంత నటించిన తాజా చిత్రం యశోద. ఈ సినిమా విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు 3.20 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది.
యశోద
యశోద

యశోద

Yashoda Day 1 Collections: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన సరికొత్త చిత్రం యశోద. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకద్వయం హరి, హరీష్ దర్శకత్వం వహించారు. విడుదలైన రోజు హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

మొదటి రోజు యశోద చిత్రానికి దేశవ్యాప్తంగా రూ.3.20 కోట్ల వసూలైనట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ వీకెండ్‌కు ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు బాగానే ఉంటాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా 30 నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని సమాచారం.

అంతేకాకుండా ఈ చిత్రం ఓటీటీ వేదిక కూడా ఫిక్స్ అయింది. ఈ చిత్రం డిజటల్ రైట్స్‌ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. యశోద మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు కనిపించట్లేదు. కనీసం 4 లేదా 5 వారాలు తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

ఈ సినిమాలో సమంత సరోగసి మదర్‌గా నటించి.. తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సామాజిక స్పృహను కలిగించే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గానూ అలరిస్తుంది. సమంత పర్ఫార్మెన్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోరు, విభిన్న కథాంశం.. చిత్రాన్ని వేరే లెవల్‌కు తీసుకెళ్తాయి.

సమంత ప్రధాన పాత్ర పోషించిన యశోద చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హరి-హరీష్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం