తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyamani Dr 56 Release Date: ప్రియమణి 'డాక్టర్ 56' మోషన్ పోస్టర్ వచ్చేసింది.. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Priyamani Dr 56 Release date: ప్రియమణి 'డాక్టర్ 56' మోషన్ పోస్టర్ వచ్చేసింది.. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

11 November 2022, 19:40 IST

    • Priyamani Dr 56 Release date: ప్రియమణి నటిస్తోన్న తాజా చిత్రం డాక్టర్ 56. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అంతేకాకుండా విడుదల తేదీని కూడా ఫిక్స్ చేసింది.
ప్రియమణి డాక్టర్ 56 మోషన్ పోస్టర్
ప్రియమణి డాక్టర్ 56 మోషన్ పోస్టర్

ప్రియమణి డాక్టర్ 56 మోషన్ పోస్టర్

Priyamani Dr 56 Release date: ఓ పక్క టీవీ షోలతో పాటు.. మరో పక్క సినిమాల్లోనూ ఫుల్ బిజీగా ఉంది ప్రియమణి. భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ నటి నటిస్తున్న సరికొత్త చిత్రం డాక్టర్ 56. రాజేశ్ ఆనంద్ లీల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్‌ను బహిర్గతపరిచారు మేకర్స్. డాక్టర్ 56 మూవీ మోషన్ పోస్టర్‌తో పాటు విడుదల తేదీని ఖరారు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను డిసెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

ఈ పోస్టర్‌ను గమనిస్తే.. సినిమా కాన్సెప్టును ఇందులో పొందుపరిచారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అనే వాక్యం ఉంచి అలాగే సస్పెన్స్ క్రియేట్ చేశారు. మోషన్ పోస్టర్‌లో ఈ సంఖ్యతో పాటు ప్రియమణి గన్ పట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

ఆ సినిమాలో ప్రియమణితో పాటు ప్రవీణ్, దీపక్ రాజ్ శెట్టి, రమేశ్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు. కథ, కథనాలను ప్రవీణ్ అందిస్తుండగా.. రాజేష్ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, హరిహర పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమాను ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డిసెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం